
రాంగైనా... రైటే!
నాలుగు లేన్ల జాతీయ రహదారిపై డివైడర్లను ఏర్పాటు చేయడం వల్ల ఇటువైపు నుంచి అటువైపు వెళ్లడం సాధ్యం కాదు. అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ సౌలభ్యాన్ని జాతీయ రహదారుల శాఖ ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఇలాంటి ప్రదేశాల్లో హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. రాప్తాడు నియోజకవర్గంలోని హంపాపురం వద్ద ఏర్పాటు చేసిన లెవెల్ క్రాస్ వద్ద ర్యాంగ్ రూట్‌లోకి వాహనదారులు దర్జాగా చొరబడుతున్నారు. ఇలాంటి తరుణంలో ఏదైనా వాహనం వేగంగా వస్తే... ప్రమాదం ఊహించుకుంటే ఒళ్లు గగుర్పాటుకు గురికాకతప్పదు.