ప్రస్తుతం కరోన కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు ఒక్కో రీతిలో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కాస్త కఠినమైన ఆంక్షలు తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే కెనడాలోని ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది.
అసలేం జరిగిందంటే...కెనడియన్‌లో ఓ తండ్రి తన సెలవు రోజుల్లో తన కొడుకుతో ఎక్కువ సమయం గడిపేలా అవకాశం ఇవ్వమంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే తల్లి ఈ విషయాన్ని వ్యతిరేకించింది. సదరు వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదంటూ అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను సాక్ష్యంగా కోర్టులో చూపించింది. పైగా తనకు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చెప్పింది.
దీంతో కోర్టు వ్యాక్సిన్ వేసుకోనప్పుడూ కొడుకుతో గడిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో మిగతా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అంతేకాదు కరోనా వ్యాక్సిన్‌లు తీసుకోనివాళ్ల పై ఆరోగ్య పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకోనివాళ్లను వీధుల్లోకి రానీయకుండా నిషేధించింది.
(చదవండి: జీరో కోవిడ్ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!)
Comments
Please login to add a commentAdd a comment