Canada court
-
అక్కడ తండ్రులు వ్యాక్సిన్లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!
ప్రస్తుతం కరోన కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు ఒక్కో రీతిలో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కాస్త కఠినమైన ఆంక్షలు తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే కెనడాలోని ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే...కెనడియన్లో ఓ తండ్రి తన సెలవు రోజుల్లో తన కొడుకుతో ఎక్కువ సమయం గడిపేలా అవకాశం ఇవ్వమంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే తల్లి ఈ విషయాన్ని వ్యతిరేకించింది. సదరు వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదంటూ అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను సాక్ష్యంగా కోర్టులో చూపించింది. పైగా తనకు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చెప్పింది. దీంతో కోర్టు వ్యాక్సిన్ వేసుకోనప్పుడూ కొడుకుతో గడిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో మిగతా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అంతేకాదు కరోనా వ్యాక్సిన్లు తీసుకోనివాళ్ల పై ఆరోగ్య పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకోనివాళ్లను వీధుల్లోకి రానీయకుండా నిషేధించింది. (చదవండి: జీరో కోవిడ్ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!) -
స్మోకర్ల అనారోగ్యం బాధ్యత సిగరెట్ కంపెనీలదే
ధూమపాన ప్రియుల చెవులలో తేనెలూరే వార్త ఇది. ఏళ్లపాటు దమ్ముమీద దమ్ము లాగి.. గుండె, ఊపిరితిత్తులూ, రక్తనాళాల్లో పొగచూరుకుపోయి.. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధి బారినపడినా ఏం ఫర్వాలేదిప్పుడు! ఎందుకంటే స్మోకర్ల అనారోగ్యానికి ఆయా సిగరెట్ కంపెనీలదే పూర్తి బాధ్యత. అలా ఇప్పటివరకూ ఆరోగ్యం చెడిపోయిన వారికి నష్టపరిహారంగా రూ.750 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఏ కోర్టు? ఏమిటా ఆదేశాలు? అంటారా.. కెనడాలోని కుబెక్ ప్రావిన్స్ సుపీరియర్ కోర్టు సోమవారం ఈ సంచలన తీర్పును ప్రకటించింది. సిగరెట్లు తాగడం వ్యసనంగా మారిందని, దానివల్ల తమ ఆరోగ్యాలు పూర్తిగా క్షీణించాయని, ఇందుకు సిగరెట్లు తయారుచేసిన కంపెనీలదే బాధ్యత అని ఆరోపిస్తూ 1998లో కొద్ది మంది స్మోకర్లు కోర్టుకెక్కారు. 17 ఏళ్ల తర్వాత ఇటీవలే ఆ కేసును విచారించిన కోర్టు.. ప్రఖ్యాత ఇంపీరియల్ టొబాకో, బెన్సన్ అండ్ హెడ్జెస్, జేటీఐ మెక్ డోనాల్డ్ టొబాకో కంపెనీలను నిందార్హమైనవిగా పేర్కొంది. బాధితులకు 12 బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. అలా ఎలా సాధ్యమైందంటే.. ప్రస్తుతం మనదేశంలో అమలవుతున్నట్లు సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులపై నిషేధిత ఆజ్ఞలేవీ కెనడాలో లేవు. పొగతాగడం హాని కరం అనే హెచ్చరికలు జారీ చేయకపోవడం కంపెనీల బాధ్యత అని, అలా చేయనందుకే ఈ శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.