ఫేస్‌బుక్ అమ్మాయి ఫ్రెండ్షిప్ రిక్వస్ట్! | Facebook Friendship Request girl! | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్ అమ్మాయి ఫ్రెండ్షిప్ రిక్వస్ట్!

Published Wed, Jan 29 2014 11:39 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

Facebook Friendship Request girl!

 ‘ఎవరి రిక్వైర్‌మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్‌బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు.
 
  ‘‘డియర్ గర్ల్...
 నీకు నేను ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టినంత మాత్రాన నిన్ను లవ్ చేస్తున్నట్టు కాదు, నిన్ను లవ్‌లో పడేయాలని కాదు, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను  డిలీట్ చేయడం నీ గొప్పతనమూ కాదు..!’’
 తన ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేయని అమ్మాయికి ఒక అబ్బాయి పెట్టిన మెసేజ్ ఇది...
 
 విరిసే ప్రతి పువ్వూ పరిమళాన్ని వెదజల్లలేదు. ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ పెట్టిన వాళ్లంతా ‘ఫ్రెండ్స్’ కాలేరు!
 తను  తిరస్కరించిన రిక్వెస్ట్‌కు కొంచెం ఘాటుగా, స్వీటుగా అమ్మాయి చెప్పిన సమాధానం ఇది! అమ్మాయిలతో స్నేహం చేయడానికి అబ్బాయిలు కెరటాల్లా ఎగసి పడుతున్నారు! ఇగోలు చంపుకొని ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ పెడుతూ  స్నేహం కోసం అర్థిస్తున్నారు.  కానీ ఇలాంటి అబ్బాయిలు ఎక్కువమంది ఉండటం అమ్మాయిలకు ఇబ్బందిగా మారుతోంది.  సోషల్‌నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌లో అమ్మాయి, అబ్బాయిల మధ్య కొత్త పోరాటానికి దారి తీస్తోంది.
 
 అబ్బాయిలు ఇంతగానా..!
 ఒక లేడీ ప్రొఫైల్ మీద ఒక అకౌంట్ ఉంటే దానికి రోజుకు సగటున పదిమంది అబ్బాయిల నుంచి ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్స్ వస్తున్నాయి. లాగిన్ అయిన మరుక్షణం డజన్ల సంఖ్యలో ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్‌లు కనిపిస్తుండే సరికి చాలా మంది అమ్మాయిలు నివ్వెర పోతున్నారు! మరోవైపు - డెరైక్ట్‌గా మన మొహం చూపించాల్సిన పని లేదు, ఒకే క్లిక్‌తో స్నేహాన్ని సంపాదించే అవకాశం ఉంది. అమ్మాయి ఫ్రెండ్షిప్‌కు  ఓకే చెబితే పర్వాలేదు, లేదంటే.. లివిట్! - ఇదీ అబ్బాయిల తీరు.
 
 నిజమైన ఫ్రెండ్షిప్‌కు స్థానముందా?!
 ఇద్దరు అపరిచితులైన అమ్మాయి, అబ్బాయిల మధ్య ఫేస్‌బుక్‌లో స్నేహం చిగురించే అవకాశం ఉందా? అంటే సమాధానానికి చాలా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయడంతో మొదలు కొని, వారి స్నేహం కొనసాగాలంటే చాలా ఫ్యాక్టర్స్ పనిచే యాల్సి ఉంటుంది. అవన్నీ సహకరిస్తే ఫేస్‌బుక్‌స్నేహం ఫలప్రదం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి ఫ్యాక్టర్స్‌లో చదువు, ఉద్యోగం, కులం... అన్నీ ప్రభావం చూపుతున్నాయి.
 
 అందమైన ప్రొఫైల్..
 ‘ఎవరి రిక్వైర్‌మెంట్స్ వాళ్లకుంటాయి...’ ఫేస్‌బుక్ స్నేహాంలో కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకోవచ్చు. తాము ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలనుకొంటున్నామో, చాటింగ్ చేద్దామనుకొంటున్నామో అమ్మాయిలకూ, అబ్బాయిలకూ చాలా క్లారిటీ ఉంటుందని చెప్పవచ్చు. తమ స్టడీస్‌కూ, కెరీర్‌కు, లైఫ్‌కు, లైఫ్‌స్టైల్‌కు... రీచ్ అవుతారనుకొనే వారికే అమ్మాయిలు తమ ఎఫ్‌బీ అకౌంట్‌కు స్వాగతం చెప్పే ట్రెండ్ కనిపిస్తోందిప్పుడు. దీన్ని బట్టి అబ్బాయిల ఎఫ్‌బీ ప్రొఫైల్‌ను బట్టి అమ్మాయిలు స్పందిస్తున్నారని అనుకోవచ్చు.
 
 సామాజిక ‘వర్గం’ కూడా..!
 ఫేస్‌బుక్ స్నేహాల్లో వ్యక్తిగత అభిరుచులు చాలా వరకూ ప్రభావాన్ని చూపిస్తున్నాయనేది చెప్పుకొన్న విషయమే. ఇందులో సామాజికవర్గాన్ని బట్టి యాక్సెప్టెన్స్ ఉంటుందనేది బహిరంగ రహస్యం. అయితే ప్రతి సారీ ఇది చెల్లుబాటు కావడం లేదు.
 
 అమ్మాయిలే అల్టిమేట్!
 అమ్మాయిల నుంచి అబ్బాయిలకు రిక్వెస్ట్ వచ్చే పరిస్థితులు అత్యంత అరుదు. అమ్మాయిలు తమ రిక్వైర్‌మెంట్స్‌కు రీచ్ అయిన వారినే స్నేహితులుగా  సమ్మతినిచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ విషయంలో అమ్మాయిలే అల్టిమేట్ అని చెప్పవచ్చు!
 
 - జీవన్‌రెడ్డి.బి
 
 మారు పేరే మంచిది!

 ఒక అమ్మాయి బస్టాప్‌లో కనిపిస్తే పది మంది అబ్బాయిలు బైకులు ఆపుకొని చూస్తారు. ఫేస్‌బుక్‌లో కూడా అంతే. ఒక రాయి వేద్దామని అబ్బాయిలు రిక్వెస్ట్ పెట్టవచ్చు. తనకూ ఒక గర్ల్‌ఫ్రెండ్ ఉందని చెప్పుకోవడానికి వీలుంటుందని అబ్బాయిలు ఇలాంటి ప్రయత్నం చేయవచ్చు. ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ రావడం అంటే అమ్మాయిలకు ఒక రకంగా ఇగో శాటిష్‌ఫ్యాక్షనే. తన పోస్టింగ్స్‌కు ఎక్కువ లైక్స్ కోరుకొనే అమ్మాయిలు ఫ్రెండ్స్ సంఖ్యను పెంచుకొంటారు. భావాలను పంచుకోవడానికే ఫేస్‌బుక్ కావాలనుకొనే అమ్మాయిలు మారు పేర్లమీద, ఫోటోలు పెట్టకుండా, అకౌంట్‌ను అపరేట్ చే సే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
 - యండమూరి వీరేంద్రనాథ్, ప్రముఖ రచయిత.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement