బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?! | Boyfriend to meet up with wrong ?! | Sakshi
Sakshi News home page

బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?!

Published Sun, Sep 13 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 AM

బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?!

బాయ్‌ఫ్రెండ్‌ని కలవడం తప్పా?!

జీవన గమనం
నేను బీటెక్ పూర్తిచేశాను. సాఫ్ట్‌వేర్ సైడ్ జాబ్ చేయాలని ఉంది. కానీ ఇంటర్వ్యూలకు వెళ్లాలంటే భయంగా ఉంది. ఎందుకంటే నాకు నత్తి. సరిగ్గా మాట్లాడలేను. సైకియాట్రిస్టులు నత్తిని పోగొడతారని విన్నాను. నిజమేనా?
 - లక్ష్మి, బెంగళూరు

 
నత్తికీ ఉద్యోగానికీ సంబంధం లేదు. కొన్ని ఇంటర్వ్యూ కమిటీలలో నేను మెంబర్‌ని. మీకు సదరు సాఫ్ట్‌వేర్‌లో ప్రవేశం ఉందన్న నమ్మకం ఇంటర్వ్యూ కమిటీకి కలిగిస్తే, (మీరు అప్లై చేసిన ఉద్యోగానికీ, నత్తికీ సంబంధం లేకపోతే) ఎవరూ మీ వైకల్యం గురించి పట్టించుకోరు.
 ఇహ మీ నిజ జీవితంలో సమస్య గురించి: నత్తి రెండు రకాలు. శారీరకంగా వచ్చినది, మానసికంగా వచ్చినది. శారీ రకమైన నత్తిని పోగొట్టడానికి నాకు తెలిసి, మందులేమీ లేవు. మానసికమైన నత్తిని సైకాలజిస్టులు పోగొట్టే వీలుంది.

మీరు సైకియాట్రిస్టులు అనే పదం వాడారు. మానసిక రోగాల్ని ‘మందుల ద్వారా’ తగ్గించేవారు సైకియాట్రిస్టులు. మానసిక ఇబ్బందులని ‘మాటల ద్వారా’ తొలగించే వారు సైకాలజిస్టులు. మీ అవసరం సైకా లజిస్టులతో ఉన్నది. నెమ్మదిగా, సున్ని తంగా, ఆవేశపడకుండా మాట్లాడే టెక్నిక్స్ నేర్పి, ధైర్యం కలిగించి, మాట్లాడటాన్ని ఒక పద్ధతిలో పెట్టటం ద్వారా వారు నత్తిని పోగొడతారు. ప్రయత్నించండి.
 
నేను ఓ స్కూల్లో టీచర్‌ని. ఓరోజు మార్కెట్‌కి వెళ్లినప్పుడు తొమ్మిదో తరగతి విద్యార్థిని అక్కడ తారస పడింది. తను నాకు చాలా నచ్చింది. తనని అలానే చూస్తూ ఉండి పోయాను. తనూ అంతే. మెల్లగా నాకు తనంటే ఇష్టం ఏర్పడింది. వాళ్ల నాన్న మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేస్తే, రిప్లై ఇచ్చింది. రెండు నెలల తర్వాత నేను ఉద్యోగానికి రాజీనామా చేసి కాంపిటీటివ్ పరీక్షలకు కోచింగ్ తీసుకోవడం మొదలు పెట్టాను. ఓరోజు ఆ అమ్మాయి ఫ్రెండ్ కనబడితే నాకు ఆ అమ్మాయంటే ఇష్టమని తనతో చెప్పాను. తను వెళ్లి ఏం చెప్పిందో కానీ ఆ రోజు నుంచీ ఆ అమ్మాయి నాతో మాట్లాడటం మానేసింది. మెసేజ్ ఇస్తే రిప్లై ఇవ్వదు. ఎందుకలా మారిపోయిందో అర్థం కావడం లేదు. నేను చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను. ఓ విద్యార్థిని పట్ల ఇలాంటి భావాలు కలిగివుండటం తప్పే. కానీ తనంటే నాకు ఇష్టం. ఏం చేయను?
 - ఓ సోదరుడు

 
తొమ్మిదో తరగతి అమ్మాయంటే సాధారణంగా మైనరయ్యుంటుంది. అటువంటివారితో సంబంధం మిమ్మల్ని కటకటాల వెనక్కి పంపించే ప్రమాదం ఉంది. వాళ్ల నాన్నగారి ఫోనుకి మీరు మెసేజులు పంపుతున్నారు. అది మరీ ప్రమాదం. ఎన్నో సందర్భాల్లో గ్రామస్థులు టీచర్లకి దేహశుద్ధి చేయటం మీరు చదివే ఉంటారు. ఆ అమ్మాయి మీకు మెసేజ్ రిప్లై ఇవ్వటంలో కేవలం స్నేహభావమో లేక మీరు పెద్దవారనే గురుభావమో ఉండి ఉండొచ్చు. ఎప్పుడైతే మీరు ప్రేమను ప్రకటించారో ఆ చిన్న అమ్మాయి తన గూడులోకి వెళ్లిపోయింది. పదిహేనేళ్ల అమ్మాయి ఆ విధంగా ప్రవర్తించటంలో ఆశ్చర్యమేమీ లేదు.
 
ఇక తనంటే మీకు చాలా ఇష్టం అన్నారు. మొదటి ప్రేమలో ఇటువంటి ఆకర్షణలు చాలా బలంగా ఉంటాయి.  ప్రేమలో పడితే చదువు ఎక్కక పోవటం సహజమే. కాబట్టి కొంతకాలం ఆ ఆలోచనల్ని పక్కన పెట్టండి. దీనికి మీకు నిర్వాణ యోగ ప్రక్రియ ఉపయోగ పడుతుంది. దాని గురించి వివరంగా నా ‘విజయ రహస్యాలు’ అనే పుస్తకంలో ఇచ్చాను. ప్రాక్టీసు చేయండి. ముందే చెప్పినట్టు కొంత కాలం కేవలం చదువు మీదే ఏకాగ్రత నిలిపితే మీ భవిష్యత్తుకి మంచిది. ప్రేమ ముఖ్యమే. కానీ భవిష్యత్తు దానికన్నా ముఖ్యం కదా!
 
నా స్నేహితురాలికి ఇటీవలే పెళ్లయ్యింది. ఆమెకి ఓ చిన్ననాటి స్నేహితుడున్నాడు. ఇద్దరిదీ మంచి స్నేహం. దానికి నేనే సాక్షిని. కానీ తన భర్త ఈ స్నేహాన్ని ఒప్పుకోవడం లేదు. అతణ్ని కలుసుకోవద్దని ఆంక్ష పెట్టాడు. తను బాధ పడుతోంది. ఏం చేయమంటారు?
 - శ్రీ సత్య, నంద్యాల

 
ప్రతి సమస్యకీ కొన్ని పరిష్కారాలు ఉంటాయి. వాటిలో ఏది మంచిదో మనమే నిర్ణయించుకోవాలి. ఈ పరిస్థితిలో మీ స్నేహితురాలు - అయితే భర్తని లెక్క చేయకుండా స్నేహితుణ్ని కలుసుకోవచ్చు. నొప్పింపక తానొవ్వక రీతిలో భర్త పరో క్షంలో అతణ్ని కలుసుకోవచ్చు. గతంలో పిక్నిక్‌కి వెళ్లినప్పుడు, ఇద్దరూ ఒకే గదిలో రాత్రంతా ఉన్నప్పుడు స్నేహితుడి ప్రవర్తన, అతడి పవిత్ర వ్యక్తిత్వం గురించి భర్తకి వివరించవచ్చు (కానీ ఇది విడా కులకి దారితీసే ప్రమాదం ఉంది).

అతడి భార్యని తన భర్తకి చెల్లిగా పరిచయం చేస్తూ ఆమెను నోరారా వదినా అని పిలుస్తూ, మొత్తం ఫ్యామిలీని ఫ్రెండ్స్‌గా చేసుకోవచ్చు. పడక సత్యాగ్రహం లాంటి పద్ధతుల ద్వారా భర్తని దారిలోకి తెచ్చుకో వచ్చు. భర్త కోసం ఇష్టం లేకపోయినానో లేక మనస్ఫూర్తిగానో పాత స్నేహానికి బై చెప్పవచ్చు. నిరంతరం నిరాశతో బాధ పడటం కంటే పై వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవడం మేలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement