రామ్చరణ్పై స్టార్ రైటర్ కామెంట్స్ | Yandamuri Veerendranath Shocking Comments On Ram Charan and Devi Sri Prasad | Sakshi
Sakshi News home page

రామ్చరణ్పై స్టార్ రైటర్ కామెంట్స్

Published Wed, Jan 20 2016 1:48 PM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

రామ్చరణ్పై స్టార్ రైటర్ కామెంట్స్

రామ్చరణ్పై స్టార్ రైటర్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ రైటర్ యండమూరి వీరేంద్రనాథ్ల అనుబంధం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. 80, 90 దశకాలలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన పలు సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పనిచేసిన యండమూరి, కొంతకాలంగా సినీరంగానికి దూరంగా ఉంటున్నారు. అయితే మెగా ఫ్యామిలీతో తన అనుబంధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. అలాంటి యండమూరి, మెగాస్టార్ తనయుడు రామ్చరణ్పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓ ఇంజనీరింగ్ కాలేజీ ఫంక్షన్కు హాజరైన యండమూరి.. చిరుతో కలిసి అభిలాష సినిమాకు పనిచేసే రోజులు గుర్తు చేసుకున్నారు. 'అప్పట్లో చరణ్ను హీరోను చేయటం కోసం అతని తల్లి సురేఖ ఎంతో కష్టపడేది. డ్యాన్స్లు నేర్పించేది. అప్పట్లో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు, తరువాత దాన్ని కూడా సరి చేయించారు. అదే సమయంలో మరో ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం ఎంతో ప్రతిభ కనబరిచేవాడు. ఇళయరాజా స్వర పరిచిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని, ఇది శివరంజనీ రాగం అని గుర్తుపట్టాడు. దీంతో ఇళయరాజా ఆ అబ్బాయి మెచ్చుకున్నాడు. అతనే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్గా గుర్తింపు తెచ్చుకున్నాడ'ని యండమూరి తెలిపారు.

యండమూరి వివరణ అక్కడితో ఆగిపోలేదు. 'రామ్చరణ్ పేరు చెప్పినపుడు మీరు చప్పట్లు కొట్టలేదు. కానీ దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పినపుడు మాత్రం చప్పట్లు కొట్టారు. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ స్వశక్తితో పైకొచ్చాడు. నువ్వు ఏంటీ అన్నది ముఖ్యం. మీ నాన్న ఎవరు అన్నది కాదు' అని వ్యాఖ్యానించారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణతి గురించి మాట్లాడి మెగాఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన యండమూరికి ఈసారి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement