
రంగస్థలం టైటిల్ సాంగ్‌లో రామ్ చరణ్
సాక్షి, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం నుంచి రెండో సాంగ్ వచ్చేసింది. రంగా.. రంగా... రంగస్థలానా రంగుపూసుకోకున్నా... అంటూ సాంగే మాస్ బీట్‌ను కాసేపటి క్రితం మేకర్లు విడుదల చేశారు. చంద్రబోస్ రాసిన సాహిత్యం.. రాహుల్ సిప్లిగంజ్ గాత్రం... అందుకు దేవీశ్రీప్రసాద్ అందించిన బాణీ అద్భుతంగా ఉంది. వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ చెర్రీ వాయిస్ ఓవర్ తో ఊర మాస్ బీట్ సాంగ్‌ను దేవీ అందించాడు. రంగస్థలం ఊరు నేపథ్యంలో సాగే ఈ పాటలో చెర్రీ స్టైలింగ్ కూడా వైవిధ్యంగానే ఉంది.
సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు. హీరోయిన్‌గా సమంత, కీలక పాత్రల్లో ఆది, అనసూయ తదితరులు నటించగా.. పూజా హెగ్డే ఐటెం సాంగ్‌లో కనిపించనుంది. మార్చి 30న రంగస్థలం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment