ఇంటి దొంగ దొరికాడు! | The householder was found! | Sakshi
Sakshi News home page

ఇంటి దొంగ దొరికాడు!

Published Sat, Jun 17 2017 11:11 PM | Last Updated on Fri, Jun 1 2018 8:52 PM

The householder was found!

కళ్యాణదుర్గం రూరల్ :

పని చేసే షాపుకే కన్నం వేసి చోరీకి పాల్పడ్డ ఇంటి దొంగను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. కళ్యాణదుర్గంలోని వాసవీ గార్మెంట్‌లో ఈ నెల 9న చోరీ జరిగింది. ఈ సంఘటనపై గార్మెంట్‌ షాపు యజమాని వెంకటేశ్‌ ఈ నెల 14న ఫిర్యాదు చేయగా.. పోలీసులు రంగంలోకి దిగారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు చోరీ చేసింది ఇంటి దొంగేనని గుర్తించారు.

గార్మెంట్‌ షాపులో పని చేసే కళ్యాణదుర్గం మున్సిపల్‌ పరిధిలోని ముదిగల్లుకు చెందిన మనోహరే చోరీకి పాల్పడినట్లు డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివప్రసాద్‌ శనివారం తెలిపారు. నిందితుడిని మీడియా ముందు హాజరుపరిచారు. నమ్మి చేరదీసిన పాపానికి నామాలు పెట్టాడన్నారు. అతని నుంచి రూ.13 లక్షలు విలువ చేసే 549.65 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement