సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఇవ్వనందుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి జరిమానా విధిం చినట్లు ఫిర్యాదుదారుడు గోపారం గోవిందరాజులు తెలి పారు.
కళ్యాణదుర్గం : సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగినా ఇవ్వనందుకు సమాచార హక్కు చట్టం కమిషనర్ విజయబాబు కళ్యాణదుర్గం మున్సిపాలిటీకి జరిమానా విధిం చినట్లు ఫిర్యాదుదారుడు గోపారం గోవిందరాజులు తెలి పారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని గాంధీచౌక్‌లో సుబ్రమణ్యేశ్వర స్వామి కాంప్లెక్స్‌లో కట్టడాల విషయంలో మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన అనుమతులు, ఇతర వివరాలపై సమాచారం కోరినా కమిషనర్, మున్సిపల్ అధికారులు ఇవ్వలేదన్నారు.
దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించగా మున్సిపాలిటీ అధికారులు సమాచారం ఇవ్వలేదని సమాచార హక్కు చట్టం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా రు. దీనికి స్పందించిన ఆయన సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించారన్న నెపంతో రూ.50 వేలు తక్షణం చెల్లించాలని, మిగిలిన రూ.25 వేలు సంబంధిత అధికారుల జీతంలో కోత వేయాలని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.