
ఫైల్ ఫోటో
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ భాస్కర్‌రెడ్డి ఆదివారం వీరిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్ మంత్రి హోదాలో కళ్యాణదుర్గానికి మొదటిసారిగా వచ్చారు.
చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి
ఓ దళిత బాలిక అనారోగ్యంతో చనిపోగా.. మంత్రి ర్యాలీ సందర్భంగా పోలీసులు విధించిన ట్రాఫిక్ ఆంక్షల వల్లే చనిపోయిందంటూ చంద్రబాబు, లోకేశ్‌లు ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వంపై ప్రజలకు ద్వేషభావం కలిగించేలా, పోలీసులకు, ప్రజలకు మధ్య విభేదాలు సృష్టించేలా అసత్య ప్రచారాలు చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని భాస్కర్‌రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కొందరు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టును వైరల్ చేశారని, వారిపైనా కేసు నమోదు చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment