
కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): వదినపై కోపంతో ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి తానే నిప్పు పెట్టాడు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని కోట వీధిలో నివాసముంటున్న నవీన్ శనివారం తన అన్న భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై కోపంతో అర్ధరాత్రి సమయంలో తన పల్సర్ బైకుకు నిప్పు పెట్టాడు. తర్వాత బంధువులు తన బైకును తగులబెట్టారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వచ్చి విచారణ చేసిన తర్వాత అసలు నిజం ఒప్పుకున్నాడు.
చదవండి👉: కాలాంతకురాలు: భర్త హత్యకు ప్రియుడితో కలిసి ప్లాన్.. కానీ..
Comments
Please login to add a commentAdd a comment