కల్యాణదుర్గం రూరల్ : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం గరుడాపురం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురికి గాయాలు కాగా, వారిలో మూడేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. శెట్టూరు మండలం చిన్నపల్లికి చెందిన వీరభద్రం, రామాంజనేయులు, జీవన్(3) ద్విచక్రవాహనంపై గరుడాపురంలో కోళ్లను కొనుగోలు చేసి తిరిగి వెళుతున్నారు.
కాగా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కల్యాణదుర్గం ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ గాయపడ్డారు. జీవన్ పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగతా ఇద్దరికి కల్యాణదుర్గం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని చిన్నారికి తీవ్ర గాయాలు
Published Sun, Jul 26 2015 12:34 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement