సీఎం చొరవతో నిలిచిన ఊపిరి | CM YS Jagan Initiative Given Successful Surgery To A Kid | Sakshi
Sakshi News home page

సీఎం చొరవతో నిలిచిన ఊపిరి

Published Sat, Dec 5 2020 5:00 AM | Last Updated on Sat, Dec 5 2020 5:42 AM

CM YS Jagan Initiative Given Successful Surgery To A Kid - Sakshi

కర్నూలు ఆస్పత్రిలో తల్లితో చిన్నారి అమిత్‌

కళ్యాణదుర్గం: సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో ఓ చిన్నారి ప్రాణం నిలిచింది. వివరాలివీ.. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండల కేంద్రానికి చెందిన ముక్కన్న, సునీతమ్మ దంపతుల కుమారుడు అమిత్‌ (4) నవంబర్‌ 24న వేరుశనగ విత్తనం మింగాడు. ఊపిరాడక ఇబ్బందిపడుతున్న కుమారుడిని గమనించిన తల్లిదండ్రులు వెంటనే  ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్‌ చేయించగా ఊపిరితిత్తుల్లోకి వేరుశనగ విత్తనం వెళ్లిందని తేలింది.

శస్త్రచికిత్సకు రూ.2.50 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్థోమత లేని చిన్నారి తల్లిదండ్రులు వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ప్రభావతమ్మ, మండల నాయకులను ఆశ్రయించారు. వారు ఇటీవల ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వెంటనే వైద్య చికిత్సలు అందించాలని కర్నూలు శ్రీసత్యసాయి ఈఎస్‌టీ ఆస్పత్రి వైద్యులకు సూచించారు. వైద్యులు శుక్రవారం శస్త్రచికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. చిన్నారి కుటుంబ సభ్యులు సీఎం, ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement