'శ్రీమంతుడు' అభిమానుల ఆందోళన | sreemanthudu fance take a strike at a theater in kalyanadurgam | Sakshi
Sakshi News home page

'శ్రీమంతుడు' అభిమానుల ఆందోళన

Published Fri, Aug 7 2015 4:46 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

sreemanthudu fance take a strike at a theater in kalyanadurgam

కల్యాణదుర్గం : శ్రీమంతుడు మూవీ రిలీజైన రోజునే చూడాలనుకున్న ఇక్కడి అభిమానులకు నిరాశే ఎదురైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో శ్రీమంతుడు సినిమా టికెట్ల ధరలు పెంచడంతో అభిమానులు ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా టికెట్టు అన్ని కేటగిరీలకు ధరలను రూ. 100గా నిర్ణయిస్తూ కల్యాణదుర్గంలోని నూర్ ముబారక్ థియేటర్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో అభిమానులు ధర్నాకు దిగి థియేటర్ ఎదుట బైఠాయించారు. థియేటర్ యాజమాన్యానికి వ్యతిరేకంగా శ్రీమంతుడు అభిమానులు నినాదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement