కల్యాణదుర్గం (అనంతపురం) : లారీ, బొలేరో వాహనం ఢీకొట్టుకున్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణ దుర్గం మండలంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని ఎర్రవల్లి వద్ద లారీ, బొలేరో వాహనాలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బొలేరో డ్రైవర్ రాజశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.