కళ్యాణదుర్గం (అనంతపురం) : పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాజు(16) స్థానిక మోడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. రెండు రోజుల క్రితం వచ్చిన ఫలితాలలో మూడు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.