అనంతపురం: కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో నిన్న ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. తల్లి తనపైన, తన కొడుకు, కూతురుపైన కిరోసిన్ పోసి నిప్పు అంటించింది.
ఈ సంఘటనలో కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడు. తల్లి, కూతురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. కుటుంబ కలహాల కారణంగానే వారు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి, కొడుకు, కూతురు మృతి
Published Thu, Dec 12 2013 10:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement