కళ్యాణదుర్గం: సమస్యల పరిష్కారం కోసం వీఆర్‌ఏ లు ధర్నాకు దిగారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఆర్డీవో కార్యలయం ఎదుట పలువురు వీఆర్‌ఏలు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరించటం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు.