అనంతపురం: అనినీతికి పాల్పడిన వీఆర్వోను ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. లంచం ఇవ్వాలని ఓ రైతును వేధిస్తున్నారనే సమాచారంతో ఏసీబీ అధికారులు వీఆర్వో ఇంటిపై దాడి చేశారు. వివరాలు... అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కాపిరి గ్రామ వీఆర్వో నాగిరెడ్డి ఓ రైతు పట్టాదారు పాసు పుస్తకంలో మార్పులు చేయడానికి లంచం అడిగాడు.
కాగా బుధవారం మధ్యాహ్నం రైతు పొన్నుస్వామి నుంచి రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ ఘటన కల్యాణదుర్గంలోని జయనగర్ కాలనీలోని నాగిరెడ్డి నివాసంలో జరిగింది. అనంతరం వీఆర్వో నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతపురం ఏసీబీ డీఎస్పీ భాస్కర్‌రెడ్డి, సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.
(కల్యాణదుర్గం)