సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జల దినోత్సవాన్ని(మార్చి 22) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్షలాది రైతుకుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి చేకూర్చే జలయజ్ఞం వాగ్దానాన్ని పునరుధ్ఘాటించారు. నవరత్నాల్లోని జలయజ్ఞం వాగ్ధానంకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కల జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం మొదలు పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. అన్ని ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే నా జలయజ్ఞ వాగ్దానమని పేర్కొన్నారు.
Fulfillment of my father, Late Dr.YS Rajashekhar Reddy’s dream irrigation projects. Completion of all pending projects including Polavaram. This is my ‘Jalayagnam’ promise! #NavaRatnalu #WorldWaterDay pic.twitter.com/exdrzUCA82
— YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2019
Comments
Please login to add a commentAdd a comment