jala yagnam
-
సీఎం వైఎస్ జగన్ చొరవతో పూర్తయిన సంగం, నెల్లూరు బ్యారేజీలు
-
సత్వర ఫలితాలిచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టుల పనులను ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం నిర్మాణం ఉన్న ప్రాజెక్టులతోపాటు అత్యవసరంగా చేపట్టాల్సిన కొత్త ప్రాజెక్టులను గుర్తించి, వాటిని ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్ సాగునీటి ప్రాజెక్టుల పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయం ఆధారంగా జీవిస్తున్నారని, రైతులకు సాగునీరు.. ప్రజలందరికీ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ సాగు, తాగునీరు అందించడానికి నీటిపారుదల ప్రాజెక్టుల పనులను ప్రధాన్యతా క్రమంలో, సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించారు. కృష్ణా వరదపై ఆధారపడ్డ జలాశయాలను 40 రోజుల్లోగా నింపడానికి చర్యలు తీసుకోవాలని, ఇందుకు చేపట్టాల్సిన పనులపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సమీకరించుకున్న ఆర్థిక వనరులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. వరద సమయంలోనే ప్రాజెక్టులన్నీ నిండాలి రాష్ట్రంలో భారీ, మధ్య తరహా, చిన్న జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం 982.35 టీఎంసీలని.. ప్రస్తుతం వాటిలో 831.46 టీఎంసీల(84.64 శాతం) నీరు నిల్వ ఉందని అధికారులు సీఎంకు వివరించారు. గతేడాది ఇదే సమయానికి 523.49 (53.29 శాతం) టీఎంసీలు నిల్వ ఉండిందని చెప్పారు. జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా జరుగుతున్న పనులు.. పెండింగ్‌లో ఉన్న పనులను నివేదించారు. పోలవరం, వంశధార, వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా సహా కొత్తగా ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులపైనా అధికారులతో సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. కృష్ణా నదికి ఇన్ని రోజులు వరద వచ్చినా, కొన్ని రిజర్వాయర్లు నిండకపోవడానికి కారణాలు ఏమిటని అధికారులను ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచి, కృష్ణా వరదను ఒడిసి పట్టి.. వరద వచ్చిన 40 రోజుల్లోగానే గాలేరు–నగరి, తెలుగుగంగ, సోమశిల, కండలేరు తదితర ప్రాజెక్టులను నింపడానికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ప్రాజెక్టులకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, అధికారులు సోమశిల నిర్వాసితులకు పరిహారం చెల్లించండి నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు నుంచి రాళ్లపాడుకు వెళ్లే కాల్వ సామర్థ్యాన్ని పెంచి, నీటిని తరలించే ఆలోచన చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. కంభం చెరువుకు వెలిగొండ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించే అవకాశాన్ని పరిశీలించాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కాలువల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమశిల జలాశయం పూర్తి స్థాయి సామర్థ్యం 78 టీఎంసీలుకాగా.. కొన్ని ముంపు గ్రామాల ప్రజలకు ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడం వల్ల 72.36 టీఎంసీలను మాత్రమే నిల్వ చేశామని అధికారులు చెప్పారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే పంపిణీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలో ముసురుమల్లి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.60 టీఎంసీలుకాగా, ప్రస్తుతం 0.56 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తి కాకపోవడం వల్ల సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయలేకపోతున్నామని, మార్చి నాటికి గేట్లు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. ఆలోగా పనులు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సోమశిల–కండలేరు కాలువకు మరో సమాంతర కాలువ కండలేరు జలాశయం పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 68.03 టీఎంసీలుకాగా, ఇప్పటిదాకా 32.30 టీఎంసీలు నింపామని అధికారులు సీఎంకు తెలిపారు. సోమశిల నుంచి కండలేరుకు ప్రస్తుతం ఉన్న కాలువ ద్వారా రోజుకు 0.8 టీఎంసీలను మించి తరలించడానికి సాధ్యం కాదని చెప్పారు. దాంతో వరద నీటిని ఒడిసి పట్టి కండలేరును నింపడానికి వీలుగా సోమశిల – కండలేరు వరద కాలువకు సమాంతరంగా మరో కాలువ తవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. కనిగిరి రిజర్వాయర్ అభివృద్ధికి రూ.20 కోట్లు ఇవ్వాలన్న స్థానిక ప్రజాప్రతినినిధుల విజ్ఞప్తిపై సీఎం సానుకూలంగా స్పందించారు. వరదను వదలొద్దు.. కృష్ణా నదికి ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండకపోవడంపై సీఎం వైఎస్ జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా, వాటి సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన గోరకల్లు రిజర్వాయర్ సామర్థ్యం 12.44 టీఎంసీలుకాగా.. ఇప్పటి వరకు 7.75 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎంకు వివరించారు. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉండటం.. అవుట్‌ఫాల్ రెగ్యులేటర్ గేట్లు బిగించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయామని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన అటవీ అనుమతులు సాధించడంతోపాటు గేట్లు బిగించే పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అవుకు రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 4.15 టీఎంసీలుకాగా.. అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నందున 3.16 టీఎంసీలు మాత్రమే నిల్వ చేశామని అధికారులు చెప్పారు. అటవీ అనుమతులు తక్షణమే వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం చెప్పారు. అలగనూరు రిజర్వాయర్‌లో కుంగిపోయిన గట్టు పనులను నవంబర్ నాటికి పూర్తిచేస్తామని, జలాశయంలో రెండు టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు వివరించారు. సకాలంలో ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళిక రాష్ట్రంలో జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి, కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) దశలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సుమారు రూ.1,40,715 కోట్లు అవసరం అవుతాయని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టును 41.15 కాంటూర్ పరిధిలో పూర్తి చేయడానికి రూ.11,172 కోట్లు, 45.72 కాంటూర్ పరిధిలో పూర్తి చేయడానికి రూ.34,488 కోట్లు అవసరం అవుతాయని చెప్పారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్తగా ప్రతిపాదించిన మూడు బ్యారేజీల నిర్మాణం సహా.. కొత్తగా చేపట్టిన, ప్రతిపాదన దశల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డి, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలుగుగంగ – ఎస్పీవీబీఆర్ కాలువ సామర్థ్యం పెంచాలి శ్రీపోతులూరి వీరబ్రహ్మం రిజర్వాయర్(ఎస్పీవీబీఆర్) నిల్వ సామర్థ్యం 17.73 టీఎంసీలుకాగా.. ఇప్పటిదాకా కేవలం రూ.4.50 టీఎంసీలను మాత్రమే నిల్వ చేశారని.. జలాశయాన్ని నింపక పోవడానికి కారణాలు ఏమిటని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. తెలుగుగంగ నుంచి ఎస్పీవీబీఆర్కు 5 వేల క్యూసెక్కులను తరలించేలా కాలువ తవ్వినా.. ఆ కాలువ ద్వారా కేవలం 1300 నుంచి 2000 వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతోందని అధికారులు వివరించారు. కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు.. కుందూ నది నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా ఎస్పీవీబీఆర్ను నింపే ప్రతిపాదనలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించి నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులు పూర్తి చేయాలన్నారు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీటిని తరలించేలా ఎత్తిపోతల సామర్థ్యాన్ని పెంచాలని ఆదేశించారు. అనంతపురం జిల్లాలో పెన్న అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్) నిల్వ సామర్థ్యం 11.10 టీఎంసీలు కాగా.. ఇప్పటిదాకా 2.62 టీఎంసీలు మాత్రమే నింపడానికి గల కారణం ఏమిటని సీఎం ప్రశ్నించారు. సీపేజీ కారణంగా పూర్తిగా నింపలేకపోతున్నామని, గ్రౌటింగ్ పనులు చేస్తున్నామని, వెంటనే పూర్తి చేస్తామని అధికారులు వివరణ ఇచ్చారు. హంద్రీ–నీవా నుంచి నుంచి నీటిని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెప్పగా, ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. హంద్రీ–నీవా నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీటిని ఇవ్వడంపై ప్రతిపాదనలు తయారు చేయాలని, తుంగభద్ర కెనాల్ ఆధునికీకరణ పనులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. హంద్రీ–నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని పెంచడం, సమాంతరంగా మరో కాలువ తవ్వడం ద్వారా కృష్ణా వరద జలాలను సద్వినియోగం చేసుకుని రాయలసీమను సస్యశ్యామలం చేయాలని ఆదేశించారు. తిరుపతి సమీపంలోని కళ్యాణి డ్యాం, ఎన్టీఆర్ జలాశయం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నింపడంపైనా సీఎం అధికారులతో చర్చించారు. కృష్ణా నదికి ఇంత వరద వచ్చినా రాయలసీమలోని కొన్ని రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో నిండలేదు. చిత్రావతి, బ్రహ్మంసాగర్‌ల పరిస్థితి ఏమిటి? కాలువల ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే వాటిని విస్తరించేందుకు వెంటనే ప్రతిపాదనలు రూపొందించండి. వరద వచ్చిన 40 రోజుల్లోనే జలాశయాలను నింపుకోవాలి. వరదను ఒడిసి పట్టండి.. శ్రీకాకుళం జిల్లాలో వంశధార స్టేజ్–2లోని ఫేజ్–2లో అంతర్భాగమైన హిరమండలం రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 19.3 టీఎంసీలుకాగా ప్రస్తుతం 5.61 టీఎంసీలను నిల్వ చేశామని అధికారులు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. వరద కాలువ పనుల్లో కొంత భాగం మిగిలాయని.. వాటిని 2020 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. మిగిలిపోయిన వరద కాలువ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎనిమిది వేల క్యూసెక్కులు ప్రవహించేలా చర్యలు తీసుకోవడం ద్వారా వంశధార వరదను ఒడిసి పట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో నేరడి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీపై విస్తృతంగా చర్చించారు. ట్రిబ్యునల్ ఆదేశాలు.. కోర్టు తీర్పుల తాజా పరిస్థితిని సమీక్షించిన సీఎం.. సమస్య పరిష్కారానికి తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పనులు పూర్తయి.. నిర్వాసితులకు పరిహారం చెల్లించకపోవడం వల్ల నీటిని నిల్వ చేయలేని ప్రాజెక్టులు, అటవీ అనుమతులు లేక.. భూసేకరణ జరగక ఆగిపోయిన ప్రాజెక్టులు, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులు, కొత్తగా అత్యవసరంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులను గుర్తించండి. ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయడానికి నవంబర్ 8 నాటికి ప్రణాళిక సిద్ధం చేయండి. -
ఇదే నా జలయజ్ఞ వాగ్దానం: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జల దినోత్సవాన్ని(మార్చి 22) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్షలాది రైతుకుటుంబాలకు వెలకట్టలేని లబ్ధి చేకూర్చే జలయజ్ఞం వాగ్దానాన్ని పునరుధ్ఘాటించారు. నవరత్నాల్లోని జలయజ్ఞం వాగ్ధానంకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కన్న కల జలయజ్ఞాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పోలవరం మొదలు పెండింగ్‌లో ఉన్న హంద్రీనీవా, గాలేరునగరి, వెలుగొండ, వంశధార, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి.. అన్ని ప్రాజెక్టులను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇదే నా జలయజ్ఞ వాగ్దానమని పేర్కొన్నారు. Fulfillment of my father, Late Dr.YS Rajashekhar Reddy’s dream irrigation projects. Completion of all pending projects including Polavaram. This is my ‘Jalayagnam’ promise! #NavaRatnalu #WorldWaterDay pic.twitter.com/exdrzUCA82 — YS Jagan Mohan Reddy (@ysjagan) March 22, 2019 -
అభివృద్ధి మంత్రం.. ఎన్నికల కుతంత్రం..
సాక్షి, అమరావతి బ్యూరో: సాగర్ కుడికాలువలో పుష్కలంగా నీరుంది. ఆరుతడి పంటలకే కాదు మాగాణికి కూడా నీరిస్తాం. వరి సాగు చేసుకోండి. ఒక్క ఎకరా కూడా ఎండనివ్వం. ఇదీ సెప్టెంబర్ 27న నాగార్జున సాగర్‌లో జలహారతి సభలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ. కట్ చేస్తే.. సీఎం హామీని నమ్మిన రైతులు మెట్ట పంటలు పీకేసి మాగాణి సాగు చేపట్టారు. నీరిస్తామన్న చంద్రబాబు.. హామీని గాలికొదిలేశారు. అధికారులు వారబందీ అంటూ నీటి విడుదలకు వంతులు వేశారు. ఎదగాల్సిన మొక్కలు నీరందక వాలిపోతుంటే గుండె బరువెక్కిన రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. నేడు నకరికల్లు వద్ద పెన్నా–గోదావరి నదుల అనుసంధానానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకానికి ఎన్నికల ముందు కొబ్బరికాయ కొడుతున్నారు. మాగాణి పంటలకే నీరివ్వలేని బాబు.. ఈ ఎత్తిపోతల.. ఉత్తికోతలేనని రైతులు మండిపడుతున్నారు. ఈ అభివృద్ధి మంత్రమంతా.. ఎన్నికల కుతంత్రమేనని స్పష్టం చేస్తున్నారు. నాగార్జున సాగర్ కుడికాలువ రైతుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉంది. గత ఏడాది ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ప్రణాళిక లోపంతో నీరు పుష్కలంగా ఉన్నా, మాగాణి పంటలు సాగవ్వలేదు. ఈ ఏడాది జలహారతి కార్యక్రమంలో భాగంగా ఏ పంటలు సాగు చేసుకున్నా నీరు ఇస్తామని సీఎం నారా చంద్రబాబు ప్రకటించారు. సీఎం మాటలు నమ్మిన రైతులు సాగు చేసిన కంది, పత్తి పంటలను దున్ని మాగాణి వేశారు. తీరా పంటలు సాగు చేశాక నీటి లభ్యత లేదని వారబందీ విధానం ప్రవేశ పెట్టారు. దీంతో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. పంటలు కాపాడుకునేందుకు అన్నదాతలు కాలువల వెంబడి నిద్రాహారాలు మాని ఆయిల్ ఇంజన్లతో నానా తంటాలు పడుతున్నారు. సీఎం మాటలు నమ్మి పూర్తిగా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల.. ఉత్తికోతలే.. గోదావరి అనుసంధానంలో భాగంగా నకరికల్లు వద్ద రూ.6200 కోట్ల అంచనాలతో ఎత్తిపోతల పథకానికి సీఎం సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే పంటలకు నీళ్లిస్తామని ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి.. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయడమేమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. సాగర్ కుడికాలువలో నీరున్నా పంటలకు అందించడం చేతగాని ప్రభుత్వం.. ఎన్నికల వేళ శంకుస్థాపన చేస్తున్న ఈ ప్రాజెక్టు గాలిలో దీపమేనని ఎద్దేవా చేస్తున్నారు. పంటలకు సాగు నీటి విషయమై ముఖ్యమంత్రిని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకీ దుస్థితి... నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో సాగు, తాగునీటి అవసరాల కోసం 136 టీఎంసీల నీరు అవసరమని కృష్ణా నది యజమాన్య బోర్డుకు అధికారులు నివేదించారు. అయితే కృష్ణా బోర్డు మాత్రం కేవలం 91 టీఎంసీల నీటిని కేటాయింంచింది. ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డుపై ఒత్తిడితెచ్చి, అవసరమైన నీటి కేటాయింపులు సాధించుకోవడంలో విఫలమైంది. గత ఏడాది మాగాణి పంటలకు నీరు ఇవ్వకపోయినా 89 టీఎంసీల నీటిని కృష్ణా బోర్డు కేటాయించటం గమనార్హం. ఈ ఏడాది మాగాణి పంటలకు నీరిస్తామని చెప్పినప్పటికీ కేటాయింపుల్లో గత ఏడాదితో పోల్చితే అదనంగా కేవలం 2 టీఎంసీలు మాత్రమే ఇచ్చారు. ఆగస్టు, సెప్టెంబరు నెలలో కాలువలకు నీరు అవసరం లేకున్నా పుష్కలంగా విడుదల చేశారు. కేటాయించిన వాటాలో నీటి వాటా కరిగిపోవటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నీటి వినియోగంపై కోత విధించారు. ప్రస్తుతం వారబందీ విధానంలో పంట పొలాలకు నీరిస్తున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కేటాయించిన నీటిలో ఇప్పటి వరకు సాగు, తాగునీటి అవసరాల వినియోగానికిపోను కేవలం 17 టీఎంసీల నీరు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం సాగులో ఉన్న మెట్ట, మాగాణి పంటలను కాపాడుకోవాలంటే మార్చి వరకు నీరివ్వాలి. 17 టీఎంసీల నీరు డిసెంబర్ 20వ తేదీ వరకు కూడా వచ్చే పరిస్థితి లేదు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పంటలు గట్టెక్కాలంటే అదనంగా 40 టీఎంసీలు కావాలి. దీని గురించి పట్టించుకోని ప్రభుత్వం..తాజాగా వేల కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకం ప్రారంభించడం రైతులపై కపట ప్రేమేనని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి ఎండుతున్న పంటలు చివరి ఆయకట్టు ప్రాంతాలైన వినుకొండ, తాడికొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట, ప్రత్తిపాడు నియోజక వర్గాల్లో మాగాణి, మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం అక్టోబరు 25వ తేదీ నుంచి కొత్తగా పంటలు సాగు చేయొద్దని ప్రకటించింది. నవంబరు ఒకటో తేదీ నుంచి వారబందీ విధానాన్ని ప్రవేశ పెట్టింది. తొమ్మిది రోజులపాటు పూర్తిగా (9000ల క్యూసెక్కులు) నీరు కాలువలకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ విధానం ప్రకారం తొమ్మిది రోజుల్లో అయకట్టుకు నీరు అందివ్వలేకపోతున్నారు. దీంతో పంటతలకు నీరందక జీవం కోల్పోతున్నాయి. -
వైఎస్సార్ చేసిన మేలు ఎవరూ మరువరు
-
చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదు
-
జలయఙ్ఞంతో రైతులకు మేలు : ధర్మాన
-
కమీషన్ల కోసం రాష్ట్రానికి అన్యాయం: ధర్మాన
సాక్షి, కర్నూలు : మహానేత వైఎస్సార్‌ను స్మరించుకుంటూ ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ‘వైఎస్సార్ గంగాహారతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజలు భారీఎత్తున తరలిరావడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ప్రసంగించారు. జలయఙ్ఞంతో రైతులకు మేలు : ధర్మాన ప్రసాద్ దేశానికి వెన్నెముక వంటి రైతు ప్రయోజనాలను రక్షించడానికి దీక్ష పూనింది వైఎస్సారేనని వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రైతు సంక్షేమం కోసం పాటుపడిన మహానేతను స్మరించుకోవడానికి వైఎస్సార్ గంగా హారతి ద్వారా అవకాశం కలిగిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రోజూ రైతులు చనిపోతున్నారని, వారికి మేలు చేయాలని ఆనాడు వైఎస్సార్ చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. ‘వ్యవసాయం దండగ’ అంటూ రైతులను అవమానించిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. రైతులు, ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్ పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. 70 లక్షల మందికి వైఎస్సార్ పెన్షన్ సదుపాయం కల్పించారన్నారు. జలయఙ్ఞం చేపట్టి రైతు కష్టాలను తీర్చడం కోసం వైఎస్సార్ కృషి చేశారన్నారు. సీఎం అంటే వైఎస్సార్‌లా ఉండాలనే పేరు పొందిన మహనీయ వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్రప్రయెజనాలను తాకట్టు పెట్టి పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. డబ్బులకు ఆశపడే కొందరు టీడీపీలో చేరారని, వారందరి భరతం పట్టే కార్యక్రమం దగ్గర్లోనే ఉందంటూ ధర్మాన ఫిరాయింపు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. వైఎస్సార్ మేలు ఎవరూ మరువరు : శిల్పా చక్రపాణి రెడ్డి వైఎస్సార్ కృషితోనే సిద్ధాపురం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధ్యమైందని శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం 1800 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు. రాయలసీమకు మహానేత చేసిన మేలును ఎవరూ మరవరన్నారు. వైఎస్ జగన్ కూడా తండ్రి బాటలో నడుస్తూ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వేదికగా మారిందని ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఒక్క ప్రాజెక్టు ప్రారంభించలేదు : నాగిరెడ్డి అపార పాలనానుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా ప్రారంభించలేదని వైఎస్సార్సీపీ నేత నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జలయఙ్ఞం పేరిట సాగునీటి ప్రాజెక్టులు మొదలుపెట్టి.. వాటి కోసం నిధులు కేటాయించింది వైఎస్సారేనని గుర్తుచేశారు. -
తొలిఫలం తెలంగాణకే..
ముందుగా పూర్తయిన గుత్ప ఎత్తిపోతల పథకం అధిక బడ్జెట్ కేటాయించిన అపర భగీరథుడు వచ్చే ఎన్నికల వరకు పాలి‘ట్రిక్స్’ను వదిలి.. ప్రజలకు పనికొచ్చే రాజకీయం చేద్దాం.. కావాలంటే ఆ ఖ్యాతిని మీరే తీసుకోండి... వివిధ ప్రాజెక్టుల పూర్తికి నిర్దేశించిన కాలపరిమితులన్నీ ‘పెళ్లి ముహుర్తాలు’ కావు.. అంతిమంగా రూ.40 వేల కోట్లతో నీటిపారుదల సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ విధానం. నదుల అనుసంధానానికి దోహదం చేసే ప్రాజెక్టులపై అపోహలు.. విమర్శలు మాని సహకరించండి - జలయజ్ఞం సందర్భంగా రాజకీయ పార్టీలకు డాక్టర్ వైఎస్ఆర్ లేఖ. (గడ్డం రాజిరెడ్డి, నిజామాబాద్): ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేందుకు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన మహాయజ్ఞమే... జలయజ్ఞం. బీడు భూముల్లో సిరులు పండి.. పుడమితల్లి పులకరించి పోవాలని తపనపడ్డ మహానేత వైఎస్సార్ కల నిజమై... కరువు జిల్లాల్లో బీడు భూములకు జలసిరులు చేరాయి. కష్టాలతో బిక్కచచ్చిన రైతుల కళ్లలో వెలుగులు నిండాయి. నెర్రెలిచ్చిన పొలాల్లోకి పరుగులు పెట్టిన నీళ్లు వేలాది మంది రైతులకు భరోసా నిచ్చాయి. ‘జలయజ్ఞం’లో తెలంగాణ ప్రాజెక్టులకు వైఎస్ పెద్దపీట వేశారు. ఫలితంగా జలయజ్ఞం కింద తొలిఫలం కూడా తెలంగాణ రైతాంగానికే దక్కింది. నిజాంసాగర్ చివరి ఆయకట్టును స్థిరీకరించేందుకు చేపట్టిన గుత్ప ఎత్తిపోతల పథకం తొలుత పూర్తయ్యింది. చంద్రబాబు హయాంలో సాగునీటి రంగంతీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్న సత్యం అప్పటి బడ్జెట్ కేటాయింపులు చూస్తే అర్థమవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ కోసం తొమ్మిదేళ్లలో బాబు పదివేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అయినా సాగు విస్తీర్ణం ఏమాత్రం పెరగలేదు. దీంతో వైఎస్ అధికారంలోకి రాగానే నీటి పథకాలకు పెద్దపీట వేశారు. ప్రాణహిత- చేవెళ్ల, దేవాదుల, కల్వకుర్తి తదితర 23 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఆయన తన ఐదేళ్ల పాలనలో తెలంగాణ ప్రాంతంలో నీటి పథకాలకు రూ. 32 వేల కోట్లు ఖర్చు చేసి, అదనంగా 25 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చి మొత్తం 35 లక్షల ఎకరాలకు నీరందించారు. మొత్తం రూ.54,266 కోట్ల అంచనాలతో తెలంగాణ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణలోని ఏడు జిల్లాల పరిధిలో 16.40 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 2008లో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద వైఎస్ శంకుస్థాపన చేశా రు. అప్పట్లోనే రూ.38.500 కోట్ల అంచనాతో ఈ పథకాన్ని చేపట్టారు. వైఎస్ మరణానంతరం ఆ పనులు మందగించాయి. జాతీయహోదా పేరిట కాలయాపన చేస్తున్నారు.