
సాక్షి, హైదరాబాద్ : ఏపీ రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో గాల్లో లెక్కలు వేసి చూపించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులు దువ్వూరి కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలలోని పథకాలనే టీడీపీ కాపీ కొట్టిందని విమర్శించారు. బడ్జెట్‌లో డ్వాక్వా రుణ మాఫీ గురించి ప్రస్తావించలేదన్నారు.
పసుపు కుంకుమ పథకం కింద కేవలం రూ.1700 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. పసుపు కుంకుమ పథకంలో ఇస్తున్న 10 వేల రూపాయలు రుణమే అని స్పష్టం అవుతుందన్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడానికి పన్నులు పెంచుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment