వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆయనను ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. విజయసాయి రెడ్డికి కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ‍్రహ్మణ్యం శనివారం ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.