జగన్‌ వెంటే నడుస్తాం | tdp activists join ysrcp | Sakshi
Sakshi News home page

జగన్‌ వెంటే నడుస్తాం

Published Wed, Sep 7 2016 1:55 AM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

జగన్‌ వెంటే నడుస్తాం - Sakshi

జగన్‌ వెంటే నడుస్తాం

హిందూపురం అర్బన్‌ : జన సంక్షేమం కోసం నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అడుగుజాడల్లో నడుస్తామని చౌళూరు గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన యువత నినదించారు. గడపగడపకూ వైఎస్సార్‌ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పోచనపల్లిలో పర్యటిస్తున్న హిందూపురం సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ చౌళూరుకు చెందిన సుబ్బరాయప్ప, నరసింహప్ప, వెంకన్న, యువకులు సాయి నరసింహప్ప, మంజు, ఆశ్వర్థ, బుజ్జి, నవీన్, ప్రవీన్, మరో 30 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి నవీన్‌నిశ్చల్‌ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, బీసీ సెల్‌ రాము, చౌళూరు రవికుమార్, బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున, కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, విద్యార్థి నాయకుడు చంద్రశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement