తెలంగాణ ఓటరు బాలకృష్ణకు హిందూపురం సీటా!
తెలంగాణ ఓటరు బాలకృష్ణకు హిందూపురం సీటా!
Published Fri, May 2 2014 4:20 PM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM
అనంతపురం జిల్లాలో నందమూరి హవాకు బ్రేక్ వేసేందుకు ఓటర్లు సిద్దమైనట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీని హిందూపురంలో ఇప్పటి వరకు ఆదరించిన ఓటర్లు ఈసారి గట్టి షాక్ ఇచ్చేందుకు రెఢీగా ఉన్నట్టు కనిపిసింది. గత ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో టీడీపీకి పట్టం కట్టారనే ధీమాతో నందమూరి వారసుడు బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగారు. అయితే ఊహాలకు అందని విధంగా బాలకృష్ణకు బైర్లు కమ్మే విధంగా స్థానికుడు, వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి నవీన్ నిశ్చల్ ప్రచారంలోనూ, ఓటర్లను ఆకట్టుకోవడంలోనూ దూసుకుపోతున్నారు.
ఓటర్లే కదా సినీ గ్లామర్ తో మేనేజ్ చేద్దాంలే అనే ఉద్దేశంతో గెలుపు కోసం కట్టిన మేడలు గాలి మేడలుగానే బాలకృష్ణకు తొందరగానే అర్దమైంది. సినీ గ్లామర్ తో ఓటర్లను మభ్యపెట్టాడానికి తన కుటంబంతోపాటు, సినీ నటులను రంగంలోకి దించారు. అయినా గెలుపు మరీ కష్టంగా మారడంతో తొలి విడుత డబ్బు పంపిణీతో చేసిన ప్రయత్నాలు ఆశాజనకంగా మారకలేకపోయాయి. దాంతో గెలుపుపై బెంగ పెట్టుకున్న బాలకృష్ణ రెండవ విడుత డబ్బు పంపిణీ చేసి ఎలాగైనా ఓటర్లను మభ్య పెట్టాలనుకుంటున్నాడట.
ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ నిశ్చల్ 'లోకల్ కార్డు' ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమయ్యారు. నందమూరి వారసుడు బాలకృష్ణ స్థానికేతరుడనే భావనను ప్రజల్లోకి తీసుకుపోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్ధి సక్సెస్ అయ్యారు. తెలంగాణ ప్రాంతంలో ఓటు హక్కు ఉంది...హిందూపురంలో సెంటు భూమి కూడా లేదు. హిందూపురంలో అడ్రస్ లేని బాలకృష్ణను గెలిపిస్తే సమస్యల పరిష్కారం కోసం తెలంగాణకు వెళ్లుతారా అని నవీన్ నిశ్చల్ ప్రశ్నిస్తున్నారు.
నిత్యం జనం మధ్య ఉండే హిందూపురం ఓటర్లు పట్టం కడుతారని నవీన్ నిశ్చల్ ధీమాగా ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబెల్ గా బరిలోకి దిగిన నవీన్ నిశ్చల్ రెండవ స్థానంలో నిలిచారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకువెళ్తూ ఓటర్లను ఆకట్టుకోవడంలో బాలకృష్ణను మించిపోయారు. సుమారు ఎనిమిది పర్యాయాలు హిందూపురంను చేజిక్కించుకున్న టీడీపీకి ఈసారి ఓటమి కనుచూపు మేరలో కనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం, టీడీపీకి ఎదురుగాలి వీస్తున్న నేపథ్యంలో సైకిల్ ఎక్కిన బాలకృష్ణ..నవీన్ నిశ్చల్ పై గెలుపు సాధించడం కష్టమే అనే భావన హిందూపురంలో నెలకొంది.
Advertisement
Advertisement