తుని ఘటనపై పోలీసుల అత్యుత్సాహం | police filed a case on naveen nischal about tuni issue | Sakshi
Sakshi News home page

తుని ఘటనపై పోలీసుల అత్యుత్సాహం

Published Thu, Feb 4 2016 6:45 PM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

police filed a case on naveen nischal about tuni issue

అనంతపురం: తుని ఘటనపై పోలీసులు అత్యుత్సాహం చూపించారు. కాపు గర్జన సందర్భంగా చెలరేగిన హింసకు బాధ్యులను చేస్తూ పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలపై ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేస్తున్నారు. దానిలో భాగంగా హిందూపురం వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త నవీన్ నిశ్చల్పై కేసు నమోదు చేశారు.

ఈ సందర్భంగా నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ.. వైఎస్ఆర్ సీపీ నేతలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. వాస్తవానికి కాపు గర్జన జరిగిన రోజున నెల్లూరులో ఉన్న నవీన్ నిశ్చల్ ఈ మేరకు ఆధారాలను జిల్లా ఎస్పీకి అందించారు. బీసీలకు నష్టం కలుగకుండా కాపులకు రిజర్వేషన్ కల్పించాలని నవీన్ నిశ్చల్తో పాటు చాంద్ బాషా, శంకర్నారాయణ పలువురు వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement