సంస్కృతిని కాపాడుకోవాలి
– తెలుçగు సంప్రదాయానికి సంక్రాంతి శుభారంభం
– వైఎస్సార్సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు
– భారీగా తరలివచ్చిన మహిళలు
హిందూపురం అర్బన్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు శుభారంభం సంక్రాంతి పండుగ.. నాటి విలువలను కాపాడుకుంటూ భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా ఉండాలని హిందూపురం అసెంబ్లీ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. సాయిప్రసాద్ మెమోరియల్ ట్రస్టు, వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంçక్రాంతి పండుగ సందర్భంగా పట్టణంలోని ఎంజీఎం క్రీడా మైదానంలో మంగళవారం ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు.
పోటీలకు నియోజకవర్గం నుంచి మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సుమారు 380 మంది మహిళలు పోటీ పడ్డారు. ఉదయం 11.10 నుంచి మధ్యాహ్నం 12.40 గంటల వరకు మహిళలు తమ ప్రతిభా పాటవాలు చాటి చెబుతూ రంగురంగుల ముగ్గులు, సంప్రదాయం ఉట్టిపడే రీతిలో ముగ్గులు వేశారు. ముగ్గుల మధ్య గొబ్బెమ్మలు, నవధాన్యాలు, చెరుకు గడలు, సంక్రాంతి లక్ష్మి కలశాలు కొలువుదీర్చి మరింత శోభను తెచ్చిపెట్టారు.
ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా సరçస్వతి వెంకటేష్‌తో పాటు మరో ముగ్గురు వ్యవహరించారు. ఈ మేరకు తొలి బహుమతి డబుల్ బెడ్‌కాట్ మంచాన్ని ఎస్‌బీఐ కాలనీకి చెందిన లక్ష్మి, ద్వితీయ బహుమతి టీక్ సోఫా సెట్‌ను ముద్దిరెడ్డిపల్లికి చెందిన సత్య, తృతీయ బహుమతి డ్రసింగ్ టేబుల్‌ను కంసాలిపేటకు చెందిన ఆశ్మిత రఘునాథన్ గెలుచుకున్నారు. అదేవిధంగా పాల్గొన్న మహిళలందరికీ బహుమతులుగా చీరలు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా సభలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ మాట్లాడుతూ ఆధునిక యుగంలో సంప్రదాయాలు తరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు పండుగలు వాటి ప్రాధాన్యం గురించి మరిచిపోతున్నారు. ఇలాంటి తరుణంలో భావితరాలను జాగృతం చేయడానికి తెలుగు పండుగల ఔనత్యాన్ని తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందుకే సంక్రాంతి అంటే రంగుల ముగ్గులు, రైతుల ఇంట ధాన్యలక్ష్మి, పతంగులు వంటివి కనిపించాలన్నారు. అనంతరం పోటీలకు హాజరైన మహిళలందరికీ భోజన వసతి కల్పించారు. ఈసందర్భంగా న్యాయనిర్ణేతలు, కవులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ బీ బ్లాక్ కన్వీనర్ మల్లికార్జున, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమాన్, మహిళా కన్వీనర్లు నాగమణి, షామింతాజ్, మండల కన్వీనర్లు నారాయణస్వామి, సదాశివరెడ్డి, నాయకులు రంగారెడ్డి, నాగిరెడ్డి, రామచంద్రారెడ్డి, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, ఆసీఫ్‌వుల్లా, షాహతాజ్, జయమ్మ, శ్రీరాంరెడ్డి, సమద్, శివశంకర్‌రెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.