అందరూ సంతోషంగా ఉండాలి | new celebrations in hindupur | Sakshi
Sakshi News home page

అందరూ సంతోషంగా ఉండాలి

Published Sun, Jan 1 2017 11:39 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

అందరూ సంతోషంగా ఉండాలి

అందరూ సంతోషంగా ఉండాలి

హిందూపురం అర్బన్‌ : నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలన్నదే తన ఆకాంక్ష అని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆయన స్వగృహంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి పుష్పాగుచ్ఛాలు, పండ్లు అందించి శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు బాగుండాలని కోరుకుంటున్నామన్నారు.

అలాగే ప్రజల సమస్యల పరిష్కారం కోసం మరింత పట్టుదలతో కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌గౌడ్, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహెమాన్, బీ బ్లాక్‌ కన్వీనర్‌ మల్లికార్జున, కన్వీనర్‌ నారాయణస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వివిధ కళాశాలల ప్రిన్సిపళ్లు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పట్టణ ప్రముఖులు తరలివచ్చి నవీన్‌నిశ్చల్‌కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement