ప్రభుత్వాన్ని నిలదీయండి
చిలమత్తూరు : హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ఆదివారం హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ దిగువపల్లి తండా, మొరంపల్లి, అంజనీ తండా గ్రామాల్లో నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 8.40 గంటలకు దిగువపల్లి తండాలో వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ప్రారంభించారు. సమన్వయకర్త నవీన్ నిశ్చల్, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రుణమాఫీ అయిందా? డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా? పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా? ఉద్యోగాలు వచ్చాయా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు పాసా? ఫెయిలా? మీరే (ప్రజలు) నిర్ణయించాలని కోరారు.
హామీల అమలు విషయాల్లో ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యే బాలకృష్ణను సినిమాల్లో తప్ప చూసింది లేదని తెలిపారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే కొడికొండలో సుడిగాలి పర్యటనలో భాగంగా మొరంపల్లికి వస్తే తాగునీటి సమస్య గురించి బిందెలతో నిరసన వ్యక్తం చే సినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా దిగువపల్లి తండాకు రోడ్డు సక్రమంగా లేదని, డ్రైనేజీలు లేవని,పింbè న్, రేషన్ కార్డు, రోడ్లు, ఇన్‌పుట్ సబ్సిడీ, రుణమాఫీ తదితర సమస్యలు పేరుకుపోయినట్లు లక్ష్మీనరసమ్మ, వెంకటలక్ష్మమ్మ, లక్ష్మమ్మ, గోవిందప్ప తదితరులు నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మారెమ్మ గుడి అభివృద్ధికి నవీన్‌నిశ్చల్ రూ.6 వేలు విరాళం అందజేశారు.
కార్యక్రమంలో కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, హిందూపురం పట్టణ మహిళ అధ్యక్షురాలు నాగమణి, షేక్ షామింతాజ్, సమ్మద్, జగన్‌మోహన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణప్ప, లక్ష్మీనారాయణ, మోదిపి లక్ష్మీనారాయణ, రామకృష్ణారెడ్డి, రామచంద్రప్ప, రంగారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నరసింహారెడ్డి, అన్నా సుందర్ రాజ్, సానే రంగారెడ్డి, గంగాధర్, ఫరూక్, నంజిరెడ్డి, నరసారెడ్డి, నాగిరెడ్డి, రవీంద్రారెడ్డి, శివారెడ్డి, ఆదిరెడ్డి, బాబేనాయక్, బాలాజీ, కృష్ణానాయక్, శ్రీరామ్‌నాయక్, రాజ్‌కుమార్‌నాయక్, ప్రసాద్‌నాయక్, లలితాబాయి, లక్ష్మీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.