gg ysrcp
-
అందరినీ మోసగిస్తోంది
– ప్రభుత్వంపై ప్రజల మండిపాటు – ‘గడప గడపకూ వైఎస్సార్’కు విశేష స్పందన అనంతపురం : ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసగిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘గడప గడపకూ వైఎస్సార్’లో అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై తూర్పారబడుతున్నారు. గురువారం అనంతపురం, హిందూపురం, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం జరిగింది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం పర్యటించారు. జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలతో పాటు మునిసిపల్ ఆఫీసులో పలుమార్లు అర్జీలిచ్చినా తనకు వద్ధాప్య పింఛను మంజూరు చేయలేదంటూ లక్ష్మీనగర్‌కు చెందిన రహమత్బీ వాపోయింది. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం తట్రకల్లులో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. ఇంటింటికీSవెళ్లి ప్రజా బ్యాలెట్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వాపోయారు. రాయదుర్గం పట్టణంలోని 14వ వార్డు టీచర్స్‌కాలనీ, ఇందరిమ్మకాలనీలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ కొళాయి అని చెప్పి ఈరోజు మంజూరు చేయలే దని లక్ష్మీ అనే మహిళ వాపోయింది. డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని మహిళలు మండిపడ్డారు. పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం పెద్దిపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పర్యటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రజలను అడిగారు. గ్రామైక్య సంఘం లీడర్ కళావతి, డ్వాక్రా మహిళ రాజేశ్వరి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల్లో తమకు రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలు మాఫీ చేశామని చెబుతున్నారని, అది కూడా మాకు ఇవ్వలేదని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం మానేంపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పర్యటించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పు కట్టలేదని, వడ్డీ పెరిగిందని మహిళలు వాపోయారు. నీటి కొళాయిల వద్ద అపరిశుభ్రత ఉందని చెప్పారు. తాడిపత్రి పట్టణం ఆస్పత్రిపాలెంలో నియోజకవర్గ అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి పర్యటించారు. -
ప్రభుత్వాన్ని నిలదీయండి
చిలమత్తూరు : హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ఆదివారం హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ దిగువపల్లి తండా, మొరంపల్లి, అంజనీ తండా గ్రామాల్లో నవీన్ నిశ్చల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం 8.40 గంటలకు దిగువపల్లి తండాలో వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరణ చేసి కార్యక్రమం ప్రారంభించారు. సమన్వయకర్త నవీన్ నిశ్చల్, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రుణమాఫీ అయిందా? డ్వాక్రా రుణాలు మాఫీ అయ్యాయా? పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా? ఉద్యోగాలు వచ్చాయా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో చంద్రబాబునాయుడు పాసా? ఫెయిలా? మీరే (ప్రజలు) నిర్ణయించాలని కోరారు. హామీల అమలు విషయాల్లో ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎమ్మెల్యే బాలకృష్ణను సినిమాల్లో తప్ప చూసింది లేదని తెలిపారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే కొడికొండలో సుడిగాలి పర్యటనలో భాగంగా మొరంపల్లికి వస్తే తాగునీటి సమస్య గురించి బిందెలతో నిరసన వ్యక్తం చే సినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా దిగువపల్లి తండాకు రోడ్డు సక్రమంగా లేదని, డ్రైనేజీలు లేవని,పింbè న్, రేషన్ కార్డు, రోడ్లు, ఇన్పుట్ సబ్సిడీ, రుణమాఫీ తదితర సమస్యలు పేరుకుపోయినట్లు లక్ష్మీనరసమ్మ, వెంకటలక్ష్మమ్మ, లక్ష్మమ్మ, గోవిందప్ప తదితరులు నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. దశలవారీగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మారెమ్మ గుడి అభివృద్ధికి నవీన్‌నిశ్చల్ రూ.6 వేలు విరాళం అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ నాగభూషణరెడ్డి, హిందూపురం పట్టణ మహిళ అధ్యక్షురాలు నాగమణి, షేక్ షామింతాజ్, సమ్మద్, జగన్మోహన్రెడ్డి, రామచంద్రారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రామకృష్ణప్ప, లక్ష్మీనారాయణ, మోదిపి లక్ష్మీనారాయణ, రామకృష్ణారెడ్డి, రామచంద్రప్ప, రంగారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు నరసింహారెడ్డి, అన్నా సుందర్ రాజ్, సానే రంగారెడ్డి, గంగాధర్, ఫరూక్, నంజిరెడ్డి, నరసారెడ్డి, నాగిరెడ్డి, రవీంద్రారెడ్డి, శివారెడ్డి, ఆదిరెడ్డి, బాబేనాయక్, బాలాజీ, కృష్ణానాయక్, శ్రీరామ్‌నాయక్, రాజ్‌కుమార్‌నాయక్, ప్రసాద్‌నాయక్, లలితాబాయి, లక్ష్మీరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
పీఏల సాయంతో దోచుకుంటున్నారు
హిందూపురం అర్బన్ : మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కుమారులు, పీఏలను అడ్డుపెట్టుకుని దోచుకోవడం, దాచుకోవడమే పనిగా పెట్టుకుని పాలన చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ నాయకత్వంలో శనివారం చిలమత్తూరు మండలంలోని కొడికొండ గ్రామంలో జరిగిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి టీడీపీ హామీల అమలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు మాటలకు మాత్రమే పరిమితమై తనయుడు లోకేష్‌కు పాలన అప్పగించారని విమర్శించారు. ఇదేlపద్ధతిలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా వారి తనయులు, పీఏలను పీఏలను అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను గాలికి వదిలేసి రౌడీలను తమ అనుచరులుగా చెప్పుకుంటున్నారన్నారు. గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు రేషన్, పింఛన్ అందటం లేదని, డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు మాఫీ కాలేదంటూ వాపోతున్నారని చెప్పారు. జిల్లాకు ఏం చేశారు..? ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు నమ్మి ప్రజలు జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇద్దరు ఎంపీలను గెలిపించారు. కానీ వారందరు జిల్లాకు ఇంతవరకు చేసిందేమీ లేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజల ప్రజలను తుంగలో తొక్కేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.