– ప్రభుత్వంపై ప్రజల మండిపాటు
– ‘గడప గడపకూ వైఎస్సార్’కు విశేష స్పందన
అనంతపురం : ప్రభుత్వం అన్ని వర్గాలనూ మోసగిస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. టీడీపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ మేరకు అమలయ్యాయో తెలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘గడప గడపకూ వైఎస్సార్’లో అన్ని వర్గాల ప్రజలూ ప్రభుత్వంపై తూర్పారబడుతున్నారు. గురువారం అనంతపురం, హిందూపురం, పెనుకొండ, రాయదుర్గం, ఉరవకొండ, తాడిపత్రి నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమం జరిగింది. అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, మాజీ మేయర్ రాగే పరుశురాం పర్యటించారు.
జన్మభూమి–మా ఊరు కార్యక్రమాలతో పాటు మునిసిపల్ ఆఫీసులో పలుమార్లు అర్జీలిచ్చినా తనకు వద్ధాప్య పింఛను మంజూరు చేయలేదంటూ లక్ష్మీనగర్‌కు చెందిన రహమత్‌బీ వాపోయింది. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం తట్రకల్లులో ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పర్యటించారు. ఇంటింటికీSవెళ్లి ప్రజా బ్యాలెట్ అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దష్టికి తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఒక్క హామీ కూడా నెరవేర్చలేదంటూ వాపోయారు. రాయదుర్గం పట్టణంలోని 14వ వార్డు టీచర్స్‌కాలనీ, ఇందరిమ్మకాలనీలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పర్యటించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికీ కొళాయి అని చెప్పి ఈరోజు మంజూరు చేయలే దని లక్ష్మీ అనే మహిళ వాపోయింది.
డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ చేయకుండా మోసం చేశారని మహిళలు మండిపడ్డారు. పెనుకొండ నియోజకవర్గంలోని రొద్దం మండలం పెద్దిపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పర్యటించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రజలను అడిగారు. గ్రామైక్య సంఘం లీడర్ కళావతి, డ్వాక్రా మహిళ రాజేశ్వరి మాట్లాడుతూ డ్వాక్రా సంఘాల్లో తమకు రూపాయి కూడా మాఫీ కాలేదన్నారు. ఒక్కో సభ్యురాలికి రూ. 3 వేలు మాఫీ చేశామని చెబుతున్నారని, అది కూడా మాకు ఇవ్వలేదని చెప్పారు. హిందూపురం నియోజకవర్గంలోని లేపాక్షి మండలం మానేంపల్లిలో నియోజకవర్గ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ పర్యటించారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇవ్వడంతో అప్పు కట్టలేదని, వడ్డీ పెరిగిందని మహిళలు వాపోయారు. నీటి కొళాయిల వద్ద అపరిశుభ్రత ఉందని చెప్పారు. తాడిపత్రి పట్టణం ఆస్పత్రిపాలెంలో నియోజకవర్గ అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి పర్యటించారు.
అందరినీ మోసగిస్తోంది
Published Thu, Sep 29 2016 10:29 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement