హోదాతోనే భవిష్యత్తు | special status protest in hindupur | Sakshi
Sakshi News home page

హోదాతోనే భవిష్యత్తు

Published Fri, Jan 27 2017 1:42 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

హోదాతోనే భవిష్యత్తు - Sakshi

హోదాతోనే భవిష్యత్తు

- వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌
- గృహనిర్బంధం చేసిన పోలీసులు
- ఇంటివద్దనే కొవ్వొత్తుల ప్రదర్శన


హిందూపురం అర్బన్‌ : ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర భవిష్యత్తు ఉందని.. హోదా సాధనలో ప్రతిఒక్కరు ఉద్యమించాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్‌సీసీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ అన్నారు. గురువారం సాయంత్రం నవీన్‌నిశ్చల్‌ ఇంటి వద్ద పోలీసులు మోహరించి గృహనిర్బంధం చేశారు. తాను బయటకు వెళ్లడం లేదని ఇంటివద్దనే నిరసన వ్యక్తం చేస్తున్నట్లు ప్రకంటించారు.

అనంతరం పాండునగర్‌లోని ఆయన నివాసం వద్దనే పార్టీ నాయకులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాన్ని గుర్తించి కేంద్రంపై ఒత్తిడి పెంచి ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి దాసోహం కావడం సిగ్గుచేటన్నారు. తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రంలో తాకట్టు పెడుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు.

ప్రతిపక్షపార్టీతో పాటు అన్నిపార్టీలు, విద్యార్థి సంఘాలు ఒకే నినాదంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీçసు బలగంతో ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. ప్యాకేజీలతో పాలకులు లబ్ధి పొందడానికి ప్రజాసంక్షేమాన్ని విస్మరిçస్తున్నామని ఎద్దేవా చేశారు. కొవ్వొత్తుల ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకులు, విద్యార్థిసంఘ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement