హిందూపురం పట్టణంలో కోట్లు విలువ చేసే భూమి కబ్జా
30 ఏళ్ల క్రితం పాల సొసైటీ ఏర్పాటు చేసుకొన్న రైతులు
పట్టణంలో భూమి కొని, భవనం నిర్మాణం
రాత్రి వేళ భవనం కూల్చేసి, స్వా«దీనంలోకి తీసుకున్న టీడీపీ నేతలు
తమ ఆస్తిని కాపాడాలంటూ పట్టణంలో రైతుల ధర్నా
హిందూపురం: సినీ హీరో, సీఎం చంద్రబాబు బావమరిది ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కబ్జాదారులు పేట్రేగిపోయారు. 30 ఏళ్ల క్రితం రైతులు హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ డెయిరీ సొసైటీ ఏర్పాటు చేసుకొని, పట్టణం నడిబొడ్డున మెయిన్ బజారులో ఓ స్థలాన్ని కొనుక్కొని అందులో భవనాన్ని నిర్మించుకొన్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంపై టీడీపీ కబ్జాదారుల కన్ను పడింది. వారు మూడురోజుల క్రితం రాత్రి వేళ ఆ భవనాన్ని కూల్చేశారు.
స్థలాన్ని చదును చేసి, వారి చేతుల్లోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం పెద్ద సంఖ్యలో పట్టణం నడిబొడ్డున ఉన్న ఆ స్థలం వద్దకు చేరుకొన్నారు. టీడీపీకి చెందిన భూ కబ్జాదారుల నుంచి రైతుల ఆస్తులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. వారికి రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ర్యాలీగా టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అక్కడ ధర్నా చేసి, ఫిర్యాదు చేశారు. సొసైటీ భవనాన్ని దౌర్జన్యంగా కూల్చివేసి, అందులోని సామగ్రి, విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన వారిని అరెస్టు చేయాలని సీఐ కరీంకు ఫిర్యాదు చేశారు.
అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందించారు. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి కూడా వెళ్లారు. ఆయన లేకపోవడంతో పీఏలకు వినతి పత్రాలు అందజేశారు. 177 మంది రైతులు కలిసి నిరి్మంచుకున్న సొసైటీ భవనాన్ని కూల్చివేసి.. ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయతి్నంచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.
సీఎం బావమరిది బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలోనే టీడీపీ నాయకులు ఇలా కబ్జాలకు పాల్పడుతున్నారంటే.. రాష్ట్రంలో ఇంకెన్ని కబ్జాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చునన్నారు. ‘సినిమాల్లో రైతుల కోసం పోరాడే బాలయ్యా.. నీ నియోజకవర్గంలోని రైతులను కాపాడు’ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ చొరవ తీసుకొని కూల్చివేసిన భవనం స్థానంలో కొత్తది నిరి్మంచి, సదుపాయాలు కలి్పంచాలని డిమాండ్ చేశారు.
పచ్చ నాయకులే కబ్జాలకు పాల్పడుతున్నారు
పాడి రైతులందరం సొసైటీగా ఏర్పడి 30 ఏళ్ల క్రితం స్థలాన్ని కొని భవనం నిరి్మంచుకున్నాం. ఈ భవనం కేంద్రంగా చాలాకాలం పాల వ్యాపారం చేసుకొన్నాం. తర్వాత వ్యాపారం దెబ్బతినడంతో సొసైటీని మూసేశాం. అయినా అందులో సామగ్రి, డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడా స్థలం విలువ రూ.కోట్లలో ఉండడంతో టీడీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇటీవల నంజుడేశ్వర బిల్డింగ్‌లోనూ ఓ షాపును దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఇలాంటివి బాలకృష్ణ నియోజకవర్గంలోనే జరగడం శోచనీయం. – చంద్రశేఖర్‌రెడ్డి, సొసైటీ సభ్యుడు, హిందూపురం
Comments
Please login to add a commentAdd a comment