సోషియో ఫ్యాంటసీ చిత్రంగా 'జై శ్రీరామ' | Ravi Shankar introduces son Advay in Subrahmanyaa | Sakshi
Sakshi News home page

సోషియో ఫ్యాంటసీ చిత్రంగా 'జై శ్రీరామ'

Published Tue, Sep 17 2024 12:13 AM | Last Updated on Tue, Sep 17 2024 12:18 AM

Ravi Shankar introduces son Advay in Subrahmanyaa

నటుడు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ పి. రవిశంకర్‌ దర్శ కత్వంలో ఆయన తనయుడు అద్వయ్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘సుబ్రహ్మణ్య’. ఈ సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ చిత్రాన్ని ప్రవీణ కడియాల, రామలక్ష్మిల సమర్పణలో తిరుమల్‌ రెడ్డి, అనిల్‌ కడియాల నిర్మిస్తున్నారు.

ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్‌ చేశారు. హీరో ఓ బావిలోకి దూకి అక్కడ ఉన్న ఓ పురాతన పుస్తకాన్ని తీసుకురావడం, ఆ పుస్తకానికి కాపలాగా ఉన్నట్లుగా ఉన్నపాములు అతనిపై దాడి చేయడం, ఓ గుడి అతని బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించడం, జై శ్రీరామ అంటూ వాయిస్‌ ఓవర్‌ రావడం వంటివి టీజర్‌లో కనిపిస్తాయి. ఈ చిత్రం 2025లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement