‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల | Official trailer of dandupalya 2 hits internet | Sakshi
Sakshi News home page

‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల

Published Sun, May 28 2017 8:13 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల

‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల

హైదరాబాద్‌: రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ మూవీస్‌ పతాకంపై వెంకట్‌ నిర్మించిన ఈ చిత్రం థియరీటికల్ ట్రైలర్ విడుదలైంది. ఇటీవల షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో దండుపాళ్యం ముఠా ఎలా అంతమవుతుందో తెరపై చూడవచ్చు.

మంచి నీళ్లు ఇవ్వండంటూ ఇళ్లల్లోకి వచ్చే ఓ ముఠా కిరాతకంగా హత్యలకు పాల్పడుతుంటుంది. ఈ ముఠా నేపథ్యంలో తొలుత కన్నడలో తీసిన క్రైమ్ థిల్లర్ మూవీ దండుపాళ్యం. ఈ చిత్రానికి కొనసాగింపే ‘దండుపాళ్యం 2’. ‘స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ప్రతి సీన్‌ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్‌ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’ అన్నారు డైరెక్టర్ శ్రీనివాసరాజు. వచ్చే నెలలో మూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement