Pooja Gandhi
-
Pooja Gandhi Marriage Photos: 40 ఏళ్ల వయసులో దండుపాళ్యం హీరోయిన్ పెళ్లి (ఫోటోలు)
-
లేటు వయసులో పెళ్లి చేసుకున్న దండుపాళ్యం హీరోయిన్
హీరోయిన్ పూజా గాంధీ లేటు వయసులో పెళ్లి చేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఓ ఇంటికి కోడలిగా వెళుతోంది. దండుపాళ్యం సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ బ్యూటీ బిజినెస్మెన్ విజయ్ ఘోర్పడేను పెళ్లాడింది. బుధవారం(నవంబర్ 29) నాడు బెంగళూరులో వీరి వివాహం జరిగింది. పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా పూజా గాంధీ.. ఖత్రోన్ కె ఖిలాడీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. బెంగాలీ, తమిళ భాషల్లోనూ నటించినా కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు పొందింది. ముక్కంటి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ తగ్గేదేలే సినిమాలోనూ నటించింది. కన్నడ దండుపాళ్యం సినిమా తెలుగులో డబ్ అవగా ఈ మూవీ హీరోయిన్‌కు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. కాగా పూజాకు 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత విజయ్ను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది పూజా గాంధీ. చదవండి: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీకి.. వాళ్లే శాశ్వతంగా దూరమయ్యారంటూ నరేశ్ ఎమోషనల్ -
పెళ్లి పీటలెక్కనున్న దండుపాళ్యం హీరోయిన్.. వరుడు ఎవరంటే?
ముంగారు పర్మ సినిమాతో శాండల్‌వుడ్‌లో ఫేమస్ అయిన నటి పూజా గాంధీ. ఆమె త్వరలోనే పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. బెంగుళూరులోని ఓ లాజిస్టిక్స్ కంపెనీ యజమాని విజయ్ను నవంబర్ 29న పెళ్లాడనున్నట్లు సమాచారం. అయితే పెళ్లికి సంబంధించి పూజా గాంధీ నుంచి ఎలాంటి ప్రకటనైతే రాలేదు. కాగా.. దండుపాళ్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పూజా. అయితే పూజా గాంధీకి విజయ్ స్వయంగా కన్నడ నేర్పించారట. బెంగాలీ అమ్మాయి అయినా పూజా సినిమా రంగంలోకి రావడానికి బెంగళూరు వచ్చినప్పుడు విజయ్ ఆమెకు కన్నడ మాట్లాడటం నేర్పించాడని అంటున్నారు. విజయ్ సహకారంతోనే పూజా గాంధీ కన్నడ నేర్చుకుని సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య పరిచయం వల్లే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారని శాండల్‌వుడ్ లేటేస్ట్ టాక్. కాగా.. ముంగారు వర్మ సినిమాలో గోల్డెన్ స్టార్ గణేష్‌తో కలిసి పూజా గాంధీ నటించింది. ఆ తరువాత పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించింది, శాండల్‌వుడ్‌లో ఫేమస్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే.. 2012లోనే పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో పూజా గాంధీకి నిశ్చితార్థం జరిగింది. కాని అనివార్య కారణాలతో నిశ్చితార్థం జరిగిన నెల రోజులకే వీరి బంధం విడిపోయింది. అంతకుముందే సినిమా డిస్ట్రిబ్యూటర్ కిరణ్‌ను పూజా గాంధీ పెళ్లి చేసుకున్నారనేది వార్త బయటకొచ్చింది. పూజా గాంధీ కెరీర్... పూజా గాంధీ ప్రధానంగా కన్నడ, తమిళ, బెంగాలీ, హిందీ, తెలుగు చిత్రాల్లో ఎక్కువగా నటించారు. ఖత్రోన్ కీ ఖిలాడీ, దుష్మణి, తమోకే సలామ్, కొక్కి వంటి చిత్రాల్లో కనిపించారు. 2006లో మాన్సూన్ రైన్ సినిమా ఆమెకు పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మిలన్, కృష్ణ, మన్మథ చిత్రాల్లో నటించారు. తమిళంలో తోతల్ పో మలరం, వైతేశ్వరన్ చిత్రాల్లో నటించారు. కన్నడలో పాయా, హనీ హనీ, యాక్సిడెంట్, కామన్న కొడుకులు, నీ టాటా నా బిర్లా, తాజ్ మహల్, కొడగన్నా కోలి నుంగిట్టా వంటి చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన దండుపాళ్యం, దండుపాళ్యం 2, దండుపాళ్యం 3, చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. -
జేడిఎస్లో చేరిన కన్నడ నటి పూజా గాంధీ
-
బీజేపీలోకి పూజా గాంధీ..?
బెంగుళూరు : నటి పూజా గాంధీ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) చేరనున్నారా?. ఈ మేరకు ఆమె బీజేపీ నేత యడ్యూరప్పను ఇప్పటికే కలుసుకున్నట్లు సమాచారం. అయితే, పూజ రాకను కర్ణాటక బీజేపీలోని కొందరు నేతలు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. పూజ చేరికపై అయిష్టతతో ఉన్నవారిని సముదాయించేందుకు పార్టీ సీనియర్ నేత మురళీధరరావు రంగంలోకి దిగారు. పూజ ఇప్పటికే జనతాదళ్, జనతా పక్ష పార్టీలు మారారు. -
నేనా సినిమా చేయట్లేదు..!
శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్‌గా తెరకెక్కిన దండుపాళ్యం సినిమా సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తరువాత ఆ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన దండుపాళ్యం 2 ఆ స్థాయిలో విజయం సాధించకపోయినా.. చిత్రయూనిట్ మరో సీక్వల్‌ను తెరకెక్కించారు. ప్రస్తుతం దండుపాళ్యం 3 రిలీజ్ అవుతుండగా చిత్రయూనిట్ దండుపాళ్యం 4 పోస్టర్‌ను కూడా లాంచ్ చేశారు. ఈ పోస్టర్లో గత చిత్రాల్లో నటించిన వారే కనిపించారు. కానీ ఈ విషయంపై నటి పూజా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను దండుపాళ్యం 4లో నటించటం లేదని తెలిపారు. తనను ఈ సినిమాలో నటించాల్సిందగా ఎవరూ అడగలేదని. తన అనుమతి లేకుండానే తన ఫొటోనూ పోస్టర్లో వేశారని తెలిపారు. తనను గాని తనకు సంబంధించిన వ్యక్తులను కానీ సంప్రదించకుండా తన పేరు వాడుకోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
అంతకు మించి...
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజాగాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో ‘దండుపాళ్యం’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల కానుంది. వెంకట్ మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ‘దండుపాళ్యం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలను రిసీవ్ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ‘దండుపాళ్యం 2’ ఓ కొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య. -
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం థియరీటికల్ ట్రైలర్ విడుదలైంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో దండుపాళ్యం ముఠా ఎలా అంతమవుతుందో తెరపై చూడవచ్చు. మంచి నీళ్లు ఇవ్వండంటూ ఇళ్లల్లోకి వచ్చే ఓ ముఠా కిరాతకంగా హత్యలకు పాల్పడుతుంటుంది. ఈ ముఠా నేపథ్యంలో తొలుత కన్నడలో తీసిన క్రైమ్ థిల్లర్ మూవీ దండుపాళ్యం. ఈ చిత్రానికి కొనసాగింపే ‘దండుపాళ్యం 2’. ‘స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’ అన్నారు డైరెక్టర్ శ్రీనివాసరాజు. వచ్చే నెలలో మూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
-
ఆల్ రియల్!
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వెంకట్ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్లో వచ్చిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ‘దండుపాళ్యం’ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది, త్వరలో విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 2’ కథ, కథనాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. -
కోర్టుకు హాజరైన ప్రముఖ నటి
బొమ్మనహల్లి(కర్ణాటక): చెక్కు బౌన్స్ కేసులో ప్రముఖ నటి పూజా గాంధీ శుక్రవారం ఇక్కడి 16వ ఏసీఎంఎం కోర్టుకు హాజరయ్యారు. కొద్ది నెలల క్రితం స్వీయ నిర్మాణంలో ఆమె ‘ముత్తులక్ష్మి’ సినిమా ప్రారంభించారు. ఈ సినిమా కోసం ఫైనాన్స్ వ్యాపారి విజయ్ కుమార్ నుంచి 4 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత రూ. 4 కోట్లకు చెక్కు ఇచ్చారు. అయితే ఈ చెక్కు బౌన్స్ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. గతంలో పలుమార్లు గైర్హాజరు కావడంతో ఆగ్రహించిన కోర్టు శుక్రవారం తండ్రి పవన్ గాంధీతో కలిసి తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీంతో ఆమె న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు. కన్నడ, తమిళం, బెంగాలీ, హిందీ, మలయాళం సినిమాల్లో పూజా గాంధీ నటించారు. 2012లో రాజకీయ ప్రవేశం చేశారు. మొదట్లో జేడీఎస్ చేరిన ఆమె తర్వాత కేజేపీలోకి మారారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాయచూరు నుంచి బీఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. -
ముత్తులక్ష్మీ పాత్రలో పూజాగాంధీ!
-
మోసం చేసిందని సినీనటిపై ఫిర్యాదు
బెంగళూరు : కన్నడ నటి పూజాగాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూజాగాంధీ కోటి రూపాయలు డబ్బు తీసుకుని పూజాగాంధీ వంచనకు పాల్పడినట్లు, నటుడు డాక్టర్ సురేశ్ శర్మ వాణిజ్యమండలికి ఫిర్యాదు చేశారు. అభినేత్రి సినిమా కోసం పూజాగాంధీ కోటి రూపాయలు నగదు తీసుకున్నదని, ఆ నగదు తిరిగి ఇప్పించాలంటూ సురేశ్ శర్మ కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ మోసానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఆయన అందచేయలేదు. నగదు అందచేసినప్పుడు సురేష్ శర్మ...పూజాగాంధీ నుంచి ఏదూనా ఆధారాలు తీసుకుని ఉండాల్సిందని వాణిజ్య మండలి కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదుపై పూజాగాంధీతో చర్చిస్తామని తెలిపారు. కాగా ఈ ఫిర్యాదు వ్యవహారంపై పూజాగాంధీ స్పందించలేదు.