లేటు వయసులో పెళ్లి చేసుకున్న దండుపాళ్యం హీరోయిన్‌ | Pooja Gandhi Married Businessman Vijay Ghorpade | Sakshi
Sakshi News home page

Pooja Gandhi: అప్పట్లో నిశ్చితార్థం రద్దు.. 11 ఏళ్ల తర్వాత పెళ్లిపీటలెక్కిన హీరోయిన్‌

Nov 30 2023 1:51 PM | Updated on Nov 30 2023 3:00 PM

Pooja Gandhi Married Businessman Vijay Ghorpade - Sakshi

కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు పొందింది. ముక్కంటి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్‌ తగ్గేదేలే సినిమాలోనూ నటించింది. కన్నడ దండుపాళ్యం సి

హీరోయిన్‌ పూజా గాంధీ లేటు వయసులో పెళ్లి చేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఓ ఇంటికి కోడలిగా వెళుతోంది. దండుపాళ్యం సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ బ్యూటీ బిజినెస్‌మెన్‌ విజయ్‌ ఘోర్పడేను పెళ్లాడింది. బుధవారం(నవంబర్‌ 29) నాడు బెంగళూరులో వీరి వివాహం జరిగింది. పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాగా పూజా గాంధీ.. ఖత్రోన్‌ కె ఖిలాడీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. బెంగాలీ, తమిళ భాషల్లోనూ నటించినా కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు పొందింది. ముక్కంటి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్‌ తగ్గేదేలే సినిమాలోనూ నటించింది. కన్నడ దండుపాళ్యం సినిమా తెలుగులో డబ్‌ అవగా ఈ మూవీ హీరోయిన్‌కు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది.

కాగా పూజాకు 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్‌ గౌడతో నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత విజయ్‌ను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది పూజా గాంధీ.

చదవండి: డిప్రెషన్‌ నుంచి గోల్డెన్‌ జూబ్లీకి.. వాళ్లే శాశ్వతంగా దూరమయ్యారంటూ నరేశ్‌ ఎమోషనల్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement