
అంతకు మించి...
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజాగాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ప్రధాన పాత్రల్లో ‘దండుపాళ్యం’కు సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించారు. తెలుగు, కన్నడ భాషల్లో జూలై 14న విడుదల కానుంది.
వెంకట్ మాట్లాడుతూ ‘‘వాస్తవ సంఘటనలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ‘దండుపాళ్యం’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ సూపర్‌హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫరెంట్ సినిమాలను రిసీవ్ చేసుకునే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ‘దండుపాళ్యం 2’ ఓ కొత్త అనుభూతి ఇస్తుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ప్రసాద్, సంగీతం: అర్జున్ జన్య.