
ఆల్ రియల్!
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వెంకట్ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్లో వచ్చిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది.
అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ‘దండుపాళ్యం’ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది, త్వరలో విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 2’ కథ, కథనాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు శ్రీనివాసరాజు.