Dandupalyam 2
-
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం థియరీటికల్ ట్రైలర్ విడుదలైంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో దండుపాళ్యం ముఠా ఎలా అంతమవుతుందో తెరపై చూడవచ్చు. మంచి నీళ్లు ఇవ్వండంటూ ఇళ్లల్లోకి వచ్చే ఓ ముఠా కిరాతకంగా హత్యలకు పాల్పడుతుంటుంది. ఈ ముఠా నేపథ్యంలో తొలుత కన్నడలో తీసిన క్రైమ్ థిల్లర్ మూవీ దండుపాళ్యం. ఈ చిత్రానికి కొనసాగింపే ‘దండుపాళ్యం 2’. ‘స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’ అన్నారు డైరెక్టర్ శ్రీనివాసరాజు. వచ్చే నెలలో మూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
-
ఆల్ రియల్!
‘బొమ్మాళి’ రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. ‘దండుపాళ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వెంకట్ మాట్లాడుతూ – ‘‘మా బ్యానర్లో వచ్చిన ‘దండుపాళ్యం’ కన్నడ, తెలుగు భాషల్లో ఘన విజయం సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ‘దండుపాళ్యం’ చిత్రానికి మించి ‘దండుపాళ్యం 2’ తెలుగు, కన్నడ భాషల్లో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది, త్వరలో విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘దండుపాళ్యం 2’ కథ, కథనాలు రియలిస్టిక్‌గా ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’’ అన్నారు శ్రీనివాసరాజు. -
ఆ గ్యాంగ్‌తో పెట్టుకుంటే అంతే సంగతి!
వాళ్లు మొత్తం తొమ్మిది మంది. ఆడ, మగ ఉన్న ఆ గ్యాంగ్ అంటే అందరికీ హడల్. ఊరి మీద పడి, కంటికి నచ్చిన ఆడవాళ్లను రేప్ చేయడం, ఆ తర్వాత చంపడం, దొంగతనాలు చేయడం మగవాళ్ల డ్యూటీ. వీళ్లకి దీటుగా గ్యాంగ్‌లో ఉన్న ఆడవాళ్లు దోపిడీలు చేస్తుంటారు. కర్ణాటకకు చెందిన ఈ దండుపాళ్య గ్యాంగ్ ఆధారంగా శ్రీనివాసరాజు దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం’ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా వెంకట్ మూవీస్ పతాకంపై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ నిర్మించిన చిత్రం ‘దండుపాళ్యం 2’. సినిమాలో కీలక తారల పాత్రలన్నీ డీ-గ్లామరైజ్డ్గానే ఉంటాయి. ఆల్రెడీ మొదటి భాగంలో పూజా గాంధీని చూసినవాళ్లు ఆశ్చర్యపోయారు. రెండో భాగంలో ఈమెతో పాటు ‘బుజ్జిగాడు మేడిన్ చెన్నై’ ఫేం సంజన కూడా నటిస్తున్నారు. ఇప్పటివరకూ చిట్టి పొట్టి దుస్తుల్లో కనిపించిన సంజన ఈ చిత్రంలో అందుకు పూర్తి భిన్నంగా డీ-గ్లామరస్‌గా కనిపించనుండటం విశేషం. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్లో చిత్రీకరించిన సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఇది సీక్వెల్ సీజన్ అనిపిస్తోంది. ‘బాహుబలి-2’, ‘రోబో’ సీక్వెల్ రూపొందుతున్నాయి. ఇలాంటి సమయంలో మా సినిమా సీక్వెల్ కూడా రూపొందడం ఆనందంగా ఉంది’’ అన్నారు. స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్ ఉత్కంఠగా ఉంటుందని దర్శకుడు చెప్పారు.