
మోసం చేసిందని సినీనటిపై ఫిర్యాదు
బెంగళూరు : కన్నడ నటి పూజాగాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పూజాగాంధీ కోటి రూపాయలు డబ్బు తీసుకుని పూజాగాంధీ వంచనకు పాల్పడినట్లు, నటుడు డాక్టర్ సురేశ్ శర్మ వాణిజ్యమండలికి ఫిర్యాదు చేశారు. అభినేత్రి సినిమా కోసం పూజాగాంధీ కోటి రూపాయలు నగదు తీసుకున్నదని, ఆ నగదు తిరిగి ఇప్పించాలంటూ సురేశ్ శర్మ కర్ణాటక చలన చిత్ర వాణిజ్య మండలికి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అయితే ఆ మోసానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలను ఆయన అందచేయలేదు. నగదు అందచేసినప్పుడు సురేష్ శర్మ...పూజాగాంధీ నుంచి ఏదూనా ఆధారాలు తీసుకుని ఉండాల్సిందని వాణిజ్య మండలి కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఈ ఫిర్యాదుపై పూజాగాంధీతో చర్చిస్తామని తెలిపారు. కాగా ఈ ఫిర్యాదు వ్యవహారంపై పూజాగాంధీ స్పందించలేదు.