భద్రాద్రి కొత్తగూడెం : ప్రేమించి...ఆనక పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేసి.. మరో యువతి మెడలో తాళి కట్టేందుకు సిద్ధమైన ప్రియుడిపై ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..కరకగూడెం మండలం వెంకటాపురానికి చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శివకుమార్...ప్రేమ పేరుతో తనని మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఏటూరు నాగారానికి చెందిన మమత అనే యువతి తన ఫిర్యాదులో పేర్కొంది.
మణుగూరు మండలం రామానుజవారం శివాలయంలో ప్రియుడు శివకుమార్ పెళ్లి జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఆమె.. మంగళవారం ఉదయం అక్కడకు చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. అయితే మమతపై శివకుమార్ తరఫు బంధువులు దాడి చేశారు. మరోవైపు శివకుమార్ అక్కడ నుంచి పరారవ్వగా, బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment