Srinivasaraju
-
అక్రమార్జనలో రారాజు
విశాఖ క్రైం: మున్సిపాలిటీలో వెలుగులు నింపాల్సిన ఆ అధికారి అవినీతి మురుగులో పీకల్లోతున కూరుకుపోయాడు. ఉద్యోగంలో చేరింది మొదలు... అందినకాడికి వెనకేసుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగడంతో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టేశాడు. ఎట్టకేలకు పాపం పండడంతో అక్రమార్జనలో రారాజుగా వెలుగొందిన శ్రీకాకుళం మున్సిపాలిటీ డీఈఈ గొట్టిముక్కల శ్రీనివాసరాజుతోపాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేశారు. విశాఖపట్నం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పది చోట్ల ఏకకాలంలో సోదాలు చేసి రూ.30 కోట్లకు పైగా అక్రమాస్తులు వెనకేసుకున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర వెల్లడించారు. గుర్తించిన అక్రమాస్తులివీ... విశాఖ నగర పరిధిలోని సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్స్న్ దరి పాపాహోం సమీపంలో గల ఆర్.ఆర్.రెసిడెన్సీలోని ప్లాట్ నెంబర్ 302లో శ్రీనివాసరాజు నివాసముంటున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆయన ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి పలు అక్రమాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కోవలి గ్రామంలో ఎక్కువగా శ్రీనివాసరాజు భూమి కొనుగోలు చేశారు. తొలిసారిగా ఈ గ్రామంలో 6.82 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు.∙అదే గ్రామంలో 7.2 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. తల్లి జి.స్వరాజ్యం పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 417/1, 418/1లో 3.19 ఎకరాలు భూమి కోనుగోలు చేశారు.\∙ అదే గ్రామంలో తండ్రి జి.కృష్ణంరాజు పేరు మీద సర్వే నెంబర్ 417/2, 449/2లలో వ్యవసాయ భూమి 2.69 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాస రాజు మామయ్య వి.నారాయణరాజు పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 416/1లో 2.49ఎకరాల వ్యవసాయ భూమి కోనుగోలు చేశారు. అదే గ్రామంలో సర్వే నెంబర్ 416/52, 416/3, 417 – 1,418 లో 4.71 ఎకరాలు కోనుగోలు చేశారు. శ్రీనివాసరాజు అత్తమ్మ వి.వరలక్ష్మి పేరు మీద కోవలి గ్రామంలోని సర్వే నెంబర్ 887/1, 887/2లో 3.6ఎకరాలు భూమి కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం నర్శింహపురం గ్రామంలో భార్య పేరిట సర్వే నెంబర్ 75/2లో 697.44 గజాల స్థలం. అదే గ్రామంలోని సర్వే నెంబర్ 75/2లో ఖాళీ స్ధలం 7.20 ఎకరాలను కుమార్తె జి.మౌనిక పేరు మీద కోనుగోలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం పెద్ద అమిరాం గ్రామంలో భార్య రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 487/1, 487/2, 487/2బిలలో 697.44 గజాల స్థలం. విశాఖ జిల్లా అడవివరం గ్రామంలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద సర్వే నెంబర్ 275 / 30 – ఎలో 183 గజాల ఇంటి స్థలం కొనుగోలు చేశారు. అలాగే శ్రీనివాస రాజు రెండు ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బంగారమే బంగారం శ్రీనివాసరాజు ఇంటిలో సోదాల సమయంలో 423.3గ్రాముల బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు అక్కయ్యపాలెం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని లాకర్లో భార్య పేరు మీద 151.78గ్రాములు బంగారు వస్తువులు, డాబాగార్డెన్స్‌లో గల బ్యాంకు ఆఫ్ ఇండియాలో భార్య జి.రాజేశ్వరి పేరు మీద లాకర్లో 221.970 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 795 గ్రాములకుపైగా బంగారు ఆభరణాలు గుర్తించారు. 1548 గ్రాముల వెంటి వస్తువులు లభ్యమయ్యాయి. అదేవిధంగా నగదు రూ.12 లక్షల 27వేలు, బ్యాంక్ బ్యాలెన్స్ రూ.5లక్షల 45 వేలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వం ధర ప్రకారం రూ.1.64కోట్లు ఉంటుందని, మార్కెట్ విలువ మాత్రం రూ.30 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. సర్వీసులో 25 ఏళ్లకుపైగా జీవీఎంసీలోనే అవినీతి ఊబిలో కూరుకుపోయిన శ్రీనివాసరాజు తన సర్వీసులో ఎక్కువ కాలంలో జీవీఎంసీలోనే తిష్ట వేశారు. బదిలీపై వెళ్లినప్పటికీ మళ్లీ వెంటనే వెనక్కు వచ్చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని వెంప గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు జీవీఎంసీలో 1988లో వర్క్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. అనంతరం 2000వ సంవత్సరంలో ఏఈగా ప్రమోషన్ వచ్చింది. అప్పటి నుంచి 2012 వరకు జీవీఎంసీలో ఏఈగా పనిచేశారు. 2012లో బొబ్బిలి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లారు. అక్కడ 18 నెలలు పని చేసి మళ్లీ ఏఈగా జీవీఎంసీకి బదిలీపై వచ్చారు. అనంతరం 2017çలో ఉద్యోగోన్నతి రావడంతో శ్రీకాకుళం మున్సిపాలిటీకి డీఈఈగా వెళ్లారు. అయితే జీవీఎంసీలో పనిచేసిన కాలంలో కొందరు అధికారులతోపాటు ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఓ ప్రజాప్రతినిధితో కలిసి బినామీల పేరున భారీగా పనులు చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బినామీల గుట్టు విప్పేందుకు కూడా ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. -
గుట్టు విప్పిన భూపతిరాజు?
-
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: రవిశంకర్, పూజా గాంధీ, రఘు ముఖర్జీ, సంజన, భాగ్యశ్రీ, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘దండుపాళ్యం 2’. శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్ మూవీస్ పతాకంపై వెంకట్ నిర్మించిన ఈ చిత్రం థియరీటికల్ ట్రైలర్ విడుదలైంది. ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో దండుపాళ్యం ముఠా ఎలా అంతమవుతుందో తెరపై చూడవచ్చు. మంచి నీళ్లు ఇవ్వండంటూ ఇళ్లల్లోకి వచ్చే ఓ ముఠా కిరాతకంగా హత్యలకు పాల్పడుతుంటుంది. ఈ ముఠా నేపథ్యంలో తొలుత కన్నడలో తీసిన క్రైమ్ థిల్లర్ మూవీ దండుపాళ్యం. ఈ చిత్రానికి కొనసాగింపే ‘దండుపాళ్యం 2’. ‘స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ గ్రిప్పింగ్‌గా ఉంటుంది. రీల్‌పై రియల్ స్టోరీ నడుస్తున్నట్లు అనిపిస్తుంది. వైవిధ్యమైన చిత్రాలను ఆదరించే తెలుగు, కన్నడ ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి పంచుతుంది’ అన్నారు డైరెక్టర్ శ్రీనివాసరాజు. వచ్చే నెలలో మూవీని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. -
‘దండుపాళ్యం 2’ ట్రైలర్ విడుదల
-
ప్రత్యామ్నాయమే శరణ్యం
♦ తిరుమలకు లింకు రోడ్డు నుంచి నాలుగులేన్ల విస్తరణ ♦ యోచిస్తున్న టీటీడీ యాజమాన్యం సాక్షి,తిరుమల : ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండ చరియలు కూలిపడి తిరుమల రె ండో ఘాట్‌రోడ్డు ధ్వంసమైన నేపథ్యంలో టీడీడీ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తోంది. 13వ కిలోమీటరు నుంచి లింక్‌రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించి రాకపోకలను వేరు చే యడమే సరైన ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల మేర రెండో ఘాట్‌రోడ్డును 1973లో నిర్మించారు. ఈ మార్గంలో రెండేళ్లుగా ఏడో కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు కూలిపడుతున్నాయి. అలిపిరి నుంచి 12వ కిలోమీటరు వద్ద హరిణి వరకు, అక్కడి నుంచి 13వ కిలోమీటరు లింక్‌రోడ్డు వరకు, అక్కడి నుంచి 16వ కిలోమీటరు తిరుమల వరకు.. ఇలా ఈ రోడ్డును మొత్తంగా మూడు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. లింకురోడ్డు నుంచి తిరుమలకు వెళ్లే మూడు కిలోమీటర్ల ప్రాంతం దెబ్బతింది. లింక్‌రోడ్డు విస్తరణతో సమస్యకు పరిష్కారం.. గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా రెండో ఘాట్‌రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డుకు అనుసంధానంగా మూడు వందల మీటర్ల లింకురోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ మార్గం నుంచే వాహనాలను తిరుమలకు మళ్లించారు. ఇక్కడి నుంచి జీఎన్సీ వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాలను అరగంటపాటు ఇటుఅటుగా ఆపేసి పంపుతున్నారు. భవిష్యత్‌లో ఇదే మార్గాన్ని వినియోగించుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరాన్ని నాలుగులేన్లుగా విస్తరించి రాకపోకలు వేరు చేయవచ్చు. నిపుణులు ఓకే అంటే.. : ఈవో సాంబశివరావు లింక్ రోడ్డు నుంచి తిరుమల జీఎన్సీ వరకు ఉండే మార్గాన్ని నాలుగు లేన్లగా విస్తరించాలని నిపుణులు సూచిస్తే తప్పనిసరిగా నిర్మిస్తాం. నిపుణుల బృందం సందర్శన కొండ చరియలు కూలుతున్న తిరుమల రెండో ఘాట్‌రోడ్డును గురువారం ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. టీటీడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో న్యూ ఢిల్లీకి చెందిన కేఎస్ రావు, చెన్నయ్‌కు చెందిన నరసింహారావు, ఎల్అండ్టీ అధికారుల బృందం ఆ ప్రాంతాలను పరిశీలించింది. దాన్ని బాగు చేసేందుకు సుమారు 15 రోజులపైబడి పడుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. అడ్డుగోడతోపాటు ఆధునిక పద్ధతుల్లో గ్రౌటింగ్ చేయాలని సూచించారు. కూలిన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అడ్డుగోడలు నిర్మించాలని, కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లోనూ రాళ్లను పరిశీలించాలని చెప్పారు. భవిష్యత్‌లో భాష్యకార్ల సన్నిధి రోడ్డు బాగా దెబ్బతినే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని లింక్‌రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరించాలని సూచించారు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ఘాట్‌రోడ్డులో శాశ్వత స్థాయి మరమ్మతులను ఎల్అండ్టీ ద్వారా చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. -
తిరుమలలో పోలీసుల హడావుడి
నాలుగు మాడ వీధుల్లో పోలీసుల దిగ్బంధనం అవసరం లేనిచోట్ల బ్యారికేడ్లు.. చేతులెత్తేసిన టీటీడీ ఉన్నతాధికారులు సాక్షి,తిరుమల: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఎన్నడూ లేనివిధంగా పోలీసుల హడావుడి పెరిగిపోయింది. వారి ధాటికి టీటీడీ ఉన్నతాధికారులు సైతం వెనక్కు వెళ్లిపోయారు. అవసరం లేనిచోట్ల బ్యారికేడ్లు నిర్మించి అడుగడుగునా భక్తులను కట్టడిచేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సాధారణంగా తిరుమల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఉన్నతాధికారుల చే తుల మీదుగానే జరగాల్సి ఉంది. ఈసారి మా త్రం అందుకు భిన్నంగా పోలీసుల చేతుల్లోకి వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్న డూ లేనివిధంగా పోలీసులు హడావుడి పెరిగి పోయింది. ఆలయం వద్ద అదనపు బ్యారికేడ్ల నిర్మించడం నుంచి వాహన సేవల ముందు గుంపులుగుంపులుగా పోలీసు దుస్తుల్లో ఉన్న అధికారుల సంఖ్య పెరిగిపోయింది. వాహన సేవ ముందు పోలీసు దుస్తుల్లో కనిపించే అధికారులు, సిబ్బంది ఉండకూడదనేది సంప్రదాయ. గత ఏడాది సంప్రదాయంగా ఉండే వే ద పాఠశాల విద్యార్థులతో వేదహారం ఏర్పాటు చేశారు. వాహన సేవ ముందు పోలీసులు లేకుండా వేద విద్యార్థులు అధికంగా ఉండడం వల్ల భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ఈసారి మాత్రం వేద విద్యార్థులను కూడా పక్కకు నెట్టి వాహనం ముందు పోలీసులే దర్శనమిచ్చారు. అలాగే, గ్యాలరీలు ఖాళీగా ఉన్నా భక్తులను మాత్రం అనుమతించకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. భక్తులు నడిచేందుకు వీలులేకుండానే రాంభగీచా వెలుపల నుంచి ఆలయ నాలుగుమాడ వీధుల్లో లెక్కకు మించి బ్యారికేడ్లు నిర్మించారు. రాంభగీచా అతిథిగృహాల్లో బస చేసేవారికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. గతంలో ఒక్క గరుడ సేవ రోజు మాత్రమే కట్టడి చేసేవారు. ఇందుకు భిన్నంగా ఈ ఏడాది తొలిరోజు నుంచే కట్టడి చేయటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహన సేవల్లో పోలీసుల జోక్యంతో జేఈవో దూరం టీటీడీ నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో గతానికి భిన్నంగా వాహన సేవల్లోనూ పోలీసుల హడావుడి పెరిగిపోవడంతో తిరుమల జేఈవో కేఎస్ శ్రీనివాసరాజుతోపాటు టీటీడీలోని పలువిభాగాల ఉన్నతాధికారులు తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ప్రచారం సాగుతోంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కాకుండా పోలీసుల కనుసన్నల్లో బ్రహ్మోత్సవ కార్యక్రమం సాగుతుండడంతో జేఈవో కొంత దూరం పాటిస్తున్నట్టు సమాచారం. వాహన సేవల్లో కూడా ఆయన నామమాత్రంగానే పాల్గొంటున్నారని ఇతర అధికారులు చెబుతున్నారు. -
సమ్మె నుంచి తిరుమలను మినహాయించండి
తిరుపతి కార్పొరేషన్, న్యూస్‌లైన్: ఏపీ ఎన్జీవోల సంఘం సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెకు పిలుపు ఇవ్వడంతో ఏపీ ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు కూడా సమ్మెకు దిగుతున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా చూసేందుకు తిరుపతి ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులతో తిరుమల జేఈవో శ్రీనివాసరాజు చర్చలు జరిపారు. ఆయన మాట్లాడుతూ తాము సమ్మెకు వ్యతిరేకం కాదని, తిరుమలకు వచ్చే భక్తులు దాదాపు 70 శాతం మంది ఆర్టీసీ బస్సుల్లో వస్తుంటారని చెప్పారు. ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసలకోర్చి వచ్చే భక్తులకు సమ్మె ద్వారా కష్టం కలిగించకుండా చూడాల్సిన బాధ్యత మనందరి కర్తవ్యమన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు నడిచే ఆర్టీసీ బస్సులను సమ్మె నుంచి మినహాయించాలని కోరారు. దీనిపై స్పందించిన నాయకులు ఇది వరకు నిర్ణయించిన మేరకు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలి పారు. తద్వారా జిల్లాలోని 8,300 మంది ఆర్టీసీ ఉద్యోగ, కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. ప్రత్యామ్నాయం కష్టమే ఆర్టీసీ కార్మికులు, టీటీడీ ఉద్యోగులు సమ్మెకు దిగనుండటంతో టీటీడీ ఆందోళన చెందుతున్నట్టు జేఈవో శ్రీనివాసరాజు మీడియాతో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే తిరుమలకు వచ్చే 70 శాతం మంది భక్తులకు ప్రత్యామ్నాయం కల్పించలేమన్నారు. తమ వద్ద కేవలం 10 నుంచి 15 శాతం మందికి రవాణా కల్పించేందుకు మాత్రమే సౌకర్యం ఉందని, అది కూడా టీటీడీ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ఉంటేనే అని చెప్పారు. జేఏసీ నాయకులు సమ్మె నుంచి తిరుమలకు మినహాయింపు ఇచ్చేది లేదని మీడియాతో చెప్పారు. సమ్మెను ఉధృతం చేస్తున్న నేపథ్యంలో తిరుమలను మినహాయిస్తే సమ్మె నీరు గారిపోతుందని స్పష్టం చేశారు. జేఈవోతోపాటు చర్చలు జరిపిన వారిలో టీటీడీ ట్రాన్స్‌పోర్టు జీఎం శేషారెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం మహేశ్వర, జేఏసీ నాయకులు చంద్రయ్య, ప్రభాకర్, బీఎస్‌బాబు (ఎన్ఎంయు మజ్దూర్), పీసీబాబు, లతారెడ్డి, తాజుద్దీన్ (వైఎస్ఆర్టీసీ మజ్దూర్), ప్రకాష్, ఈఆర్ కుమార్, ఎన్వీ కుమార్ (ఎంప్లాయిస్ యూనియన్), సీఐటీయూ నేత చంద్ర పాల్గొన్నారు.