హరీశ్‌ శంకర్‌ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు | Director Harish Shankar Helping Video Goes Viral | Sakshi
Sakshi News home page

హరీశ్‌ శంకర్‌ సాయం.. నెటిజన్ల నుంచి ప్రశంసలు

Mar 14 2024 11:18 AM | Updated on Mar 14 2024 11:31 AM

Director Harish Shankar Helping Video Viral - Sakshi

టాలీవుడ్‌లో సోషల్‌ మీడియా ద్వారా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో హరీశ్‌ శంకర్‌ ఒకరు.  ఇండస్ట్రీలో ఆయన తక్కువ సినిమాలే డైరెక్ట్‌ చేసినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాలపైనే కాకుండా పలు సామాజిక అంశాలపైనా తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ఆయన చెప్పడమే కాకుండా ఇతరులకు సాయం చేస్తూ కూడా అప్పుడప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంటారు.

ఈ క్రమంలో తాజాగా ఆయన చేసిన ఒక మంచి  పనికి సోషల్ మీడియా ద్వారా ఆయన్ను అభినందిస్తున్నారు. హైదరాబాద్‌ సిటీలో రోడ్డుపై నిలిచిపోయిన ఒక కారు విషయంలో హరీశ్‌ సాయం అందించారు.  నడిరోడ్డుపై ఆగిపోయిన కారును హరీశ్‌తో పాటు మైత్రి మేకర్స్‌ నిర్మాతలలో ఒకరైన రవిశంకర్‌ కలిసి కొంత దూరం పాటు చేతుల సాయంతో నెట్టుకుంటూ వెళ్లారు. దీనిని గమనించిన కొందరు వారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి నెట్టింట వదిలారు. దీంతో హరీశ్‌, నిర్మాత రవిశంకర్‌ల సింప్లిసిటికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రవితేజ హీరోగా హరీశ్ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. 'మిస్టర్‌ బచ్చన్‌' పేరుతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. హిందీలో ఘన విజయం సాధించినన 'రైడ్‌' మూవీకి రీమేక్‌ అని ప్రచారం జరుగుతుంది. మరోవైపు పవన్‌ కల్యాణ్‌ హీరోగా 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌'ను కూడా హరీశ్‌ రూపొందిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్ట్‌ల తర్వాత హరీశ్-  చిరంజీవితో సినిమా చేయనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌కు చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల ప్రొడ్యూసర్‌ ఉండనున్నారట. కానీ ఈ విషయంలో అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement