హరీశ్‌ మరో చిత్రం.. పవన్‌ ఫ్యాన్స్‌కు డౌట్‌ | Harish Shankar To work With 14 Reels Plus Team Again | Sakshi
Sakshi News home page

పవన్‌ ఫ్యాన్స్‌కు క్లారిటీ ఇచ్చిన హరీశ్

Published Tue, May 19 2020 11:27 AM | Last Updated on Tue, May 19 2020 12:09 PM

Harish Shankar To work With 14 Reels Plus Team Again - Sakshi

‘గద్దలకొండ గణేష్‌’తో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్నారు క్రేజీ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌. తాజాగా ఆయన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌‌తో ఓ చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. హరీశ్‌ కాంబినేషన్‌లో వస్తున్న పవన్‌ 28వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ఇప్పటికే కథ, స్క్రిప్ట్‌ను సిద్దం చేసిన దర్శకబృందం ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతోంది. అంతేకాకుండా లాక్‌డౌన్‌ అనంతరం నిర్వీరామంగా షూటింగ్‌ జరిపేందుకు పూర్తి సన్నద్దమవుతోంది చిత్ర బృందం. అయితే ఈ చిత్ర షూటింగ్‌ ఇంకా ప్రారంభం కాక ముందే మరో చిత్రాన్ని లైన్లో పెట్టారు హరీశ్‌ శంకర్‌. 

ఈ విషయాన్ని మరో ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్‌ ప్లస్‌ అధికారికంగా ప్రకటించింది. హరీశ్‌తో ఓ సినిమా చేస్తున్నట్లు పేర్కొంది. గతంలో ఇదే నిర్మాణ సంస్థలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘గద్దల కొండ గణేష్‌’ చిత్రం తెరకెక్కించాడు హరీశ్‌. దీన్ని ఉద్దేశిస్తూ ‘గద్దల కొండ గణేష్‌ తర్వాత మరోసారి పవర్‌ఫుల్‌ దర్శకుడు హరీశ్‌తో పనిచేసేందుకు ఆనందంగా ఉన్నాం. త్వరలోనే ఇతర వివరాలు తెలియజేస్తామ’ని  14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. అయితే ఈ ట్వీట్‌తో పవన్‌ అబిమానుల్లో అనుమానాలు రేకెత్తాయి. పవన్‌-హరీశ్‌ సినిమా వాయిదా పడిందా అనే అనుమానంతో ఓ అబిమాని హరీశ్‌కు ట్వీట్‌ చేశాడు. ‘హరీశ్‌ అన్నా నువ్వు ఎన్ని సినిమాలైనా చేయ్‌. కానీ తర్వాతి చిత్రం పవన్‌తోనే ఉండాలి. అది కూడా చరిత్ర సృష్టించాలి’ అని పవర్‌స్టార్‌ ఫ్యాన్‌ ట్వీట్‌ చేశాడు. 

దీనికి ప్రతి స్పందనగా ‘ తమ్ముడు.. పవర్‌స్టార్‌ మూవీ స్క్రిప్ట్‌, మ్యూజిక్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. నేను చేసే ఏ ప్రాజెక్ట్‌ అయినా పవన్‌ చిత్రం తరువాతే ఉంటుంది. నేను కూడా మీలాగే పవన్‌కు వీరాభిమాని అని మర్చిపోకు’ అంటూ హరీశ్‌ ట్వీట్‌ చేశారు. ఇక హరీశ్‌-పవన్‌ కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్‌ సింగ్‌’ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీంతో వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎన్నో అంచనాలను పెట్టుకుంది.  

చదవండి:
హీరో సూర్య నిర్ణయం: దర్శకుడి ప్రశంసలు
42 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement