పవన్‌ కల్యాణ్‌.. ‘ఇప్పుడే మొదలైంది’? | Pawan Kalyan Harish Shankar Next Telugu Movie Update | Sakshi
Sakshi News home page

‘ఇప్పుడే మొదలైంది’ అంటున్న పవన్‌?

Published Wed, May 13 2020 1:30 PM | Last Updated on Wed, May 13 2020 2:25 PM

Pawan Kalyan Harish Shankar Next Telugu Movie Update - Sakshi

రీఎంట్రీ తర్వాత పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయ్యారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో పింక్‌ రీమేక్‌ ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఇక ఈ చిత్రం తర్వాత మరో రెండు సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు పవర్‌ స్టార్‌. ఏఎమ్‌ రత్నం నిర్మాణంలో క్రిష్‌ డైరెక్షన్‌లో ‘విరూపాక్ష’ (ప్రచారంలో ఉన్న టైటిల్‌) చేస్తున్నారు.పీరియాడిక జానర్‌లో తెరకెక్కుత్ను ఈ చ్రితంలో పవన్‌ క్యారక్టరైజేషన్‌ రాబిన్‌ హుడ్‌ తరహాలో ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. క్రిష్‌ చిత్రం తర్వాత హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో పవన్‌ నటించనున్నారు. గబ్బర్‌సింగ్‌ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ తర్వాత పవన్‌-హరీష్‌ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. 

పవన్‌ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకొని ఓ పవర్‌ ఫుల్‌ స్క్రిప్ట్‌ను డైరెక్టర్‌ సిద్దం చేసి పెట్టుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో మలయాళ నటి మానసా రాధాకృష్ణన్‌ హీరోయిన్‌గా నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. పవన్‌-హరీష్‌ కాంబినేషన్‌లో వస్తున్న  రెండో చిత్రానికి ‘ఇప్పుడే.. మొదలైంది’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు లీకువీరులు పేర్కొంటున్నారు. గబ్బర్‌ సింగ్‌ విడుదలై 8 ఏళ్లు అయిన సందర్భంగా హరీష్‌ శంకర్‌ చేసిన ట్వీట్‌తో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. ఈ ట్వీట్‌లో ‘ఇప్పుడే మొదలైంది.. మేము మళ్లీ వస్తున్నాం' అని పేర్కొన్నారు. అలాగే, ఆ తర్వాత చేసిన ట్వీట్‌లలో కూడా ఆ టైటిల్‌ను హైలైట్ చేయడంతో సినిమా పేరు అదే అని అందరూ ఫిక్సయ్యారు. అయితే చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పూర్తి కమర్షియల్‌ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్‌ నిర్మిస్తుండగా.. దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు. 

చదవండి:
‘జాన్వీ కపూర్‌’ వెనక ఇంత కథ ఉందా?
శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement