ఈ కామర్స్ అవకాశాలపై పోస్టల్ శాఖ కన్ను
న్యూఢిల్లీ: ఈ కామర్స్ అవకాశాలపై దృష్టిపెట్టాల్సిందిగా తపాలా శాఖ అధికారులను టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. చేనేత కార్మికులు, హస్త కళాకారులు, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను వారి ఇంటివద్ద నుంచి సేకరించి కావలసిన వారి ఇంటివద్దకు చేర్చేలా తపాలా శాఖ పనిచేయాలని ఆయన కోరారు. కాగాపార్శిళ్ల రవాణాకు రోడ్డు రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారొకరు చెప్పారు.
ఈ కామర్స్ వ్యాపార అవకాశాలను అందిపుచ్చేకునే ప్రయత్నాలను చేస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కొత్త టెక్నాలజీతో ఉపగ్రహాల సాయంతో పార్శిళ్లను ట్రాక్ చేసే మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పార్శిళ్ల స్టేటస్‌ను వినియోగదారులకు తెలియజేసే ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నామని వివరించారు. ఇప్పటికే అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.