Naaptol
-
Naaptol: నాప్టాల్ సంచలన నిర్ణయం.. అక్కడా కూడా ఎంట్రీకి రెడీ!
అతి తక్కువ ధరలకే వస్తువులను అందించే టెలిషాపింగ్, ఆన్లైన్ ప్లాట్‌ఫాం నాప్టోల్(Naaptol Online Shopping Pvt. Ltd) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీవో ద్వారా నిధులను సేకరించాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 1,000 కోట్లే లక్ష్యంగా..! నాప్టోల్ ఆన్లైన్ షాపింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఐపీవో ద్వారా 1,000 కోట్ల నిధులను సమీకరించేందుకు ప్రణాళికలను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఐపీవో ప్రణాళికలను కంపెనీ చెందిన ప్రముఖ వ్యక్తులు వెల్లడించారు. నాప్టోల్ ఇప్పటికే ఐపీవోకి సంబంధించిన డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి ఐసిఐసిఐ సెక్యూరిటీస్, ఆనంద్ రాఠి సలహాలను ఇస్తున్నాయి. కంపెనీకి చెందిన ప్రతిపాదిత ఐపీవో ప్రాథమిక, ద్వితీయ వాటా విక్రయాలు మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే కంపెనీకి ఇప్పటికే ఉన్న కొంతమంది ఇన్వెస్టర్లు ఐపీవోలో తమ షేర్లలో కొంత భాగాన్ని అమ్మే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా నిధుల సేకరణ దాని బ్యాక్-ఎండ్, ఆన్లైన్ షాపింగ్ పోర్టల్‌ను బలోపేతం చేయడానికి ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. కాగా నాప్టోల్ వ్యవస్థాపకుడు , చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మను అగర్వాల్ కంపెనీ ఐపీవో ప్రణాళికలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. తక్కువ ధరలకే..! అతి తక్కువ ధరలకే వస్తువులను అందిస్తూ నాప్టోల్ టెలిషాపింగ్ మార్కెట్లో భారీ ఆదరణనే పొందింది. 2008లో పలు ఉత్పత్తుల ఆవిష్కరణ కోసం మొదటిసారి టీవీ చానల్‌ను కంపెనీ స్థాపించింది. వినూత్నమైన ప్రచారంతో ఆయా ఉత్పత్తులను సేల్ చేస్తోంది. హిందీతో పాటుగా స్థానిక భాషలు తమిళం, తెలుగు, మలయాళం, కన్నడతో సహా బహుళ భాషలలో టీవీ ఛానెల్‌ల ద్వారా ఉత్పత్తులను సేల్ చేస్తోంది. గత ఏడాది ఫ్లాట్‌గా..! జపాన్‌కు చెందిన Mitsui & Co., జేపీ మోర్గాన్, వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ న్యూ ఎంటర్ప్రైజ్ అసోసియేట్స్ వంటి పెట్టుబడిదారుల మద్దతు నాప్టోల్‌కు ఉంది. వీరి నుంచి 2018లో 15 మిలియన్ డాలర్లను, 2015లో 51.7 మిలియన్ డాలర్లను నాప్టోల్ సేకరించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి నాప్టోల్ ఫ్లాట్‌గా రాబడిని చూసినప్పటికీ, మునుపటి ఆర్థిక సంవత్సరంలో నష్టాలతో పోలిస్తే మార్జినల్ లాభాలను పొందగలిగింది. ఇది FY20లో రూ. 321.22 కోట్ల నుంచి, FY21లో రూ. 318.87 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది .అయినప్పటికీ, ఇది FY20లో రూ. 51.84 కోట్ల నష్టం నుంచి FY21లో రూ. 3.42 కోట్ల లాభానికి తన కార్యకలాపాలను మార్చగలిగింది. చదవండి: ఐపీఓకి ముందు ఎల్ఐసీ కీలక నిర్ణయం..! -
డబ్బులు పంపాలని నాప్టాల్ పేరుతో లేఖ
చింతల్: సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అమాయకులను నిలువునా ముంచుతున్నారు. ఇప్పటికే పలు విధాలుగా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతున్న వీరు తాజాగా స్పీడ్ పోస్టుల పేరుతోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇంటి చిరునామాలను గుర్తించి నేరుగా మీకు విలువైన గిఫ్ట్ వచ్చిందంటూ ఇంటికి లెటర్లు పంపుతున్నారు. తాజాగా చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన కె.శ్రీరాములు నాప్టాల్ పేరిట గిఫ్ట్ వచ్చినట్లు లెటర్ పంపారు. గిప్ట్ సంబంధించిన విలువలో నాలుగు శాతం ఆన్లైన్లో చెల్లించాలని, మరో మూడు శాతం ఖర్చులకు చెల్లించాలని పేర్కొన్నారు. అంతేగాకుండా వెంటనే నగదు చెల్లించాలని కోరుతూ అతడికి ఫోన్ చేశారు. దీంతో బాధితుడు నాప్టాల్ కంపెనీకి ఫోన్ చేయగా తాము ఎలాంటి లెటర్ పంపలేదని పేర్కొన్నట్లు ‘సాక్షి’కి తెలిపాడు. -
12 లక్షలు ఎర... 8 లక్షలు స్వాహా!
సాక్షి, సిటీబ్యూరో: ట్యాబ్ కొంటే కారు బహుమతిగా వచ్చిందట... ఆ కారు వద్దంటే దాని విలువ రూ.12 లక్షలు నగదు రూపంలో ఇస్తారట... అలా ఇవ్వడానికి ‘రిఫండబుల్ డిపాజిట్’ రూ.8 లక్షలు చెల్లించాలట... ఇది నమ్మిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిలువుగా మునిగాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కేవీఎం ప్రసాద్ దర్యాప్తు ప్రారంభించారు. రెహ్మత్‌నగర్‌కు చెందిన అనిల్‌కుమార్ ప్రభుత్వ ఉద్యోగి. ఈయనకు మార్చ్‌లో రాజీవ్‌శర్మ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. న్యాప్‌టోల్ సంస్థ అసిస్టెంట్ అడ్మిన్ అధికారిగా పరిచయం చేసుకు న్న రాజీవ్ అసలు కథ మొదలెట్టాడు. మీరు ఇటీ వల మా సంస్థ నుంచి ఆన్లైన్లో ట్యాబ్ కొనుగోలు చేశారని, ఇలాంటి వినియోగదారుల వివరాలతో లాటరీ తీయగా మీకు లక్కీ డిప్ తగిలిం దని చెప్పాడు. బహుమతిగా రూ.12.8 లక్షల విలువైన కారు అందిస్తున్నామని, అది వద్దనుకుంటే ఆ మొత్తం చెల్లించేస్తామంటూ ఎర వేశాడు. ఈ విషయం నిజమని నమ్మిన అనిల్ తన బ్యాం కు ఖాతా వివరాలు, గుర్తింపు కార్డును వాట్సాప్ ద్వారా రాజీవ్‌కు పంపాడు. ఆ నగదు పొందడానికి రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.12 వేలు చెల్లించాలంటూ చెప్పిన రాజీవ్ అసలు కథ ప్రారంభించాడు. నిజమేనని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని రాజీవ్ చెప్పిన ఖాతాలోకి బదిలీ చేశాడు. అనిల్‌ను పూర్తిగా నమ్మించేందుకు రాజీవ్ తన పేరుతో ఉన్న ఆధార్ కార్డు, న్యాప్‌టోల్ సంస్థ జారీ చేసినట్లు ఓ గుర్తింపుకార్డులను వాట్సాప్‌లో పంపించాడు. ‘వసూలు పరంపర’లో భాగంగా రాజీవ్ ఆదాయపుపన్ను, జీఎస్టీ, ఇన్సూరెన్స్ తదితర చార్జీల పేర్లతో 14 దఫాల్లో రూ. 8.18 లక్షలు తన బ్యాంకు ఖాతాల్లో జమ చేయించుకున్నాడు. ప్రతి సందర్భంలోనూ ఈ సొమ్మంతా రిఫండబుల్ అని చెబుతూ అనిల్‌ను నమ్మించాడు. ఈ క్రమంలో బాధితుడితో రాజీవ్‌శర్మతో పాటు అతడి అనుచరులమంటూ సునీల్ చౌదరి, షానవాజ్ అనే వ్యక్తులూ సంభాషించి డబ్బు డిపాజిట్ చేయించుకున్నారు. డబ్బు చెల్లించినా తన బహుమతి మొత్తంతో పాటు రిఫండబుల్ డిపాజిట్స్ తిరిగి రాకపోవడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న అధికారులు బ్యాంకు ఖాతాలతో పాటు ఫోన్ నెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. -
నాప్టోల్ ఆఫ్‌లైన్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్ : వినియోగదారులకు వాస్తవిక అను భూతి కలిగించేలా రాష్ట్రంలో తొలిసారి ఆఫ్‌లైన్ స్టోర్‌ను అమీర్‌పేటలో ప్రారంభించినట్లు హోం షాపింగ్ సంస్థ నాప్టోల్ సీఎఫ్ఓ యూసుఫ్‌ఖాన్ తెలిపారు. ఆదివారం బేగంపేట పర్యాటక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్ సెంట ర్లు ఏర్పాటు చేయడం, 26 వేలకు పైగా పిన్‌కోడ్ నె ంబర్లకు తమ నెట్వర్క్ విస్తరిస్తున్నామన్నారు. వ చ్చే ఏడాది లోగా దాదాపు కోటి మంది వినియోగ దారులను చేరే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ బిజినెస్ హెడ్ మనీష్చౌబే, బిజినెస్ పార్టనర్ అమర్జీత్సింగ్ పాల్గొన్నారు. -
ఈ కామర్స్ అవకాశాలపై పోస్టల్ శాఖ కన్ను
న్యూఢిల్లీ: ఈ కామర్స్ అవకాశాలపై దృష్టిపెట్టాల్సిందిగా తపాలా శాఖ అధికారులను టెలికాం మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఆదేశించారు. చేనేత కార్మికులు, హస్త కళాకారులు, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను వారి ఇంటివద్ద నుంచి సేకరించి కావలసిన వారి ఇంటివద్దకు చేర్చేలా తపాలా శాఖ పనిచేయాలని ఆయన కోరారు. కాగాపార్శిళ్ల రవాణాకు రోడ్డు రహదారి నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించామని పోస్టల్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ కామర్స్ వ్యాపార అవకాశాలను అందిపుచ్చేకునే ప్రయత్నాలను చేస్తున్నామని పేర్కొన్నారు. దీంట్లో భాగంగా కొత్త టెక్నాలజీతో ఉపగ్రహాల సాయంతో పార్శిళ్లను ట్రాక్ చేసే మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా పార్శిళ్ల స్టేటస్‌ను వినియోగదారులకు తెలియజేసే ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా ప్రారంభించనున్నామని వివరించారు. ఇప్పటికే అమెజాన్, స్నాప్‌డీల్ వంటి ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని తెలిపారు.