చింతల్: సైబర్ నేరగాళ్లు రోజుకో ఎత్తుగడతో అమాయకులను నిలువునా ముంచుతున్నారు. ఇప్పటికే పలు విధాలుగా ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న వీరు తాజాగా స్పీడ్ పోస్టుల పేరుతోనూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. వివిధ మార్గాల్లో ఫోన్ నెంబర్ల ఆధారంగా ఇంటి చిరునామాలను గుర్తించి నేరుగా మీకు విలువైన గిఫ్ట్ వచ్చిందంటూ ఇంటికి లెటర్లు పంపుతున్నారు. తాజాగా చింతల్ డివిజన్ భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన కె.శ్రీరాములు నాప్‌టాల్ పేరిట గిఫ్ట్ వచ్చినట్లు లెటర్ పంపారు. గిప్ట్ సంబంధించిన విలువలో నాలుగు శాతం ఆన్‌లైన్‌లో చెల్లించాలని, మరో మూడు శాతం ఖర్చులకు చెల్లించాలని పేర్కొన్నారు. అంతేగాకుండా వెంటనే నగదు చెల్లించాలని కోరుతూ అతడికి ఫోన్ చేశారు. దీంతో బాధితుడు నాప్‌టాల్ కంపెనీకి ఫోన్ చేయగా తాము ఎలాంటి లెటర్ పంపలేదని పేర్కొన్నట్లు ‘సాక్షి’కి తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment