Pushpa 2: ఆ సీన్స్ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు.. సినిమాకే హైలెట్‌! | Pushpa 2 The Rule Movie Producer Ravi Shankar Comments On Jatara Episode Highlights In National Press Meet | Sakshi
Sakshi News home page

Pushpa 2 Jatara Scene: ఆ సీన్స్ కోసం అల్లు అర్జున్ చాలా కష్టపడ్డారు.. సినిమాకే హైలెట్‌!

Published Thu, Oct 24 2024 3:41 PM | Last Updated on Thu, Oct 24 2024 4:04 PM

Pushpa 2 producer Ravi Shankar Says Jatara episode is the highlight of the movie

నిర్మాత రవి శంకర్‌

పుష్ప 2 ప్రమోషన్స్‌ నేటితో ప్రారంభం అయినట్లే. విడుదల తేదిని ప్రకటిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు మేకర్స్‌. ఈ మూవీ డిసెంబర్‌ 6న కాకుండా ఒక రోజు అంటే డిసెంబర్‌ 5నే ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గురువారం హైదరాబాద్‌లో ప్రెస్‌ మీట్‌ని నిర్వహించి ఈ కొత్త రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు నిర్మాతలు. ఈ సినిమా కోసం హీరో అల్లు అర్జున్‌ చాలా కష్టపడ్డారని చెప్పారు. ఆయన కోసం అయినా ఈ సినిమాను బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ చేయాలని కోరారు.

(చదవండి: పుష్ప 2 రిలీజ్‌ డేట్‌ మారింది.. ముందే వచ్చేస్తున్న ‘పుష్ప’రాజ్‌)

ఇక ఈ సినిమాలో ప్రతీ సీన్‌ అదిరిపోతుందట. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌ అయితే సినిమాకే హైలెట్‌ అని చెప్పారు. ‘జాతర ఎపిసోడ్‌ షూటింగ్‌కి 35 రోజుల సమయం పట్టింది. ఆ సీన్స్‌ కోసం బన్నీ చాలా కష్టపడ్డారు. 20 రోజుల పాటు రిహార్సల్‌ చేసి షూటింగ్‌లో పాల్గొన్నారు. బాడీ మొత్తం పెయింటింగ్‌ వేసుకొని రోజంతా ఆ గెటప్‌లోనే ఉండేవాడు. చెమట వచ్చి పెయింటింగ్‌ పాడైపోకుండా చిన్న ఫ్యాన్‌ పెట్టుకునేవాడు. జాతర ఎపిసోడే కాదు సినిమా మొత్తానికి అల్లు అర్జున్‌ చాలా కష్టపడ్డారు. సుకుమార్‌ కూడా చాలా జాగ్రత్తగా సినిమాను తీర్చిదిద్దారు. 

(చదవండి: అభిమాని రిక్వెస్ట్‌.. వెంటనే స్పందించిన బన్నీ)

జాతర ఎపిసోడ్‌కి భారీగా ఖర్చు చేశాం. తెరపై  చూస్తే కూడా మేం పెట్టిన ఖర్చు కనిపిస్తుంది. సినిమాలో గూస్‌బంప్స్‌ వచ్చే సీన్లు చాలా ఉంటాయి’అని నిర్మాత రవిశంకర్‌ అన్నారు. అలాగే పార్ట్‌ 2ని హిట్‌ చేస్తే కచ్చితంగా పుష్ప 3ని తెరకెక్కిస్తామని చెప్పారు. ఇక మెగాఫ్యాన్స్‌, బన్నీ ఫ్యాన్స్‌ మధ్య జరుగుతున్న గొడవ గురించి మాట్లాడుతు.. ‘అల్లు అర్జున్‌కు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. మెగా ఫ్యాన్స్‌ అంతా ఒక్కటే. అందరూ సినిమా లవర్సే. ఫ్యాన్స్‌కు , హీరోలకు రాజకీయాలతో ముడిపెట్టొద్దు’ అని రవిశంకర్‌ కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement